RR vs KKR : మ్యాచ్ జరుగుతుండగా.. మైదానంలోకి దూసుకువచ్చి మరీ రియాన్ పరాగ్ కాళ్లు మొక్కిన అభిమాని.. నెట్టింట ట్రోల్స్..
కేకేఆర్, ఆర్ఆర్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఓ అనూహ్య ఘటన చోటు చేసుకుంది.

pic credit @mufaddal_vohra
ఐపీఎల్ 2025 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ వరుసగా రెండో మ్యాచ్‌లోనూ ఓడిపోయింది. తొలి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఓడిపోగా.. బుధవారం గౌహతి వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ 8 వికెట్ల తేడాతో పరాజయాన్ని చవిచూసింది.
ఈ మ్యాచ్‌లో ఆర్ఆర్ మొదట బ్యాటింగ్ చేసింది. ధ్రువ్ జురెల్ (33; 28 బంతుల్లో 5 ఫోర్లు), రియాన్ పరాగ్ (25; 15 బంతుల్లో 3 సిక్సర్లు), యశస్వి జైస్వాల్ (29; 24 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లు)లు రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 151 పరుగులు సాధించింది. కోల్‌కతా బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, వైభవ్ అరోరా, హర్షిత్ రాణా, మొయిన్ అలీ లు తలా రెండు వికెట్లు తీశారు.
RR vs KKR : కావాలనే క్వింటన్ డికాక్ సెంచరీని అడ్డుకున్న ఆర్చర్..
A fan breached the field and touched Riyan Parag’s feet. pic.twitter.com/9dU2lwCXEg
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 26, 2025
ఆ తరువాత లక్ష్యాన్ని కోల్‌కతా 17.3 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి అందుకుంది. కేకేఆర్ బ్యాటర్లలో క్వింటన్ డికాక్ (97 నాటౌట్; 61 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సర్లు) దంచికొట్టాడు. రాజస్థాన్ బౌలర్లలో వనిందు హసరంగ ఓ వికెట్ పడగొట్టాడు.
మైదానంలోకి దూసుకువచ్చిన అభిమాని..
ఈ మ్యాచ్‌లో ఓ అనూహ్య ఘటన చోటు చేసుకుంది. కేకేఆర్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఓ అభిమాని సెక్యూరిటీ కళ్లు గప్పి మైదానంలోకి పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఆర్ఆర్ కెప్టెన్ రియాన్ పరాగ్ కాళ్లు మొక్కాడు. అనంతరం అతడిని కౌగిలించుకున్నాడు. ఇన్నింగ్స్ 11వ ఓవర్‌లో ఈ ఘటన జరిగింది. ఈ ఓవర్‌ను పరాగ్ వేశాడు. దీంతో మ్యాచ్‌కు కాసేపు అంతరాయం కలిగింది.
కాగా.. ఈ ఘటనపై సోషల్ మీడియాలో పరాగ్ పై ట్రోలింగ్ మొదలైంది. అతడు ఏం చేశాడని సదరు అభిమాని కాళ్లు మొక్కాడని కామెంట్లు చేస్తున్నారు. కొందరు ఓ అడుగు ముందుకు వేసి.. డబ్బులు ఇచ్చి మరీ పరాగ్ ఇలా చేయించుకున్నాడని అభిప్రాయపడుతున్నారు. అయితే.. ఈ ఘటన జరిగిన తరువాత పరాగ్ వేసిన బంతిని డికాక్ సిక్స్‌గా మలచడం ఇక్కడ కొసమెరుపు.
Kavya Maran : కావ్యా మారన్ ఎన్ని వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యానికి వారసురాలో తెలుసా?
So, Riyan Parag hired a boy and paid him 10,000 Rs to come onto the ground and touch his feet.
What an attention seeker this guy is!
#RRvsKKR pic.twitter.com/0w7gfW7lAC
— Dr Nimo Yadav 2.0 (@niiravmodi) March 26, 2025
అస్సాం నుంచి టీమ్ఇండియాకు ప్రాతినిధ్యం వహించిన తొలి క్రికెటర్ రియాన్ పరాగ్ అని, చాలా కాలంగా అతడు ఆర్ఆర్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడని, ఈ క్రమంలో అస్సాంలో అతడు ఓ స్టార్ ఆటగాడు అని అందుకనే అతడి కాళ్లు మొక్కి ఉండవచ్చునని కొందరు పరాగ్ మద్దతుగా కామెంట్లు చేస్తున్నారు.