Justin Langer : రిషబ్ పంత్ 30 బంతుల్లో 95 పరుగులు చేశాడు.. లక్నో కోచ్ ఆసక్తికర వ్యాఖ్యలు.. కాకపోతే..
ముంబైతో మ్యాచ్ అనంతరం విలేకరుల సమావేశంలో లక్నో కోచ్ జస్టిన్ లాంగర్ (Justin Langer) తమ జట్టు ఓటములపై స్పందించాడు
- Thota Vamshi Kumar
- Updated on- May 5, 2026 / 10:04 AM IST
Lucknow Super Giants coach Justin Langer intresting comments on Rishabh Pant
- రిషబ్ పంత్ పేలవ ఫామ్ పై స్పందించిన లక్నో కోచ్
- రెండు రోజుల క్రితం ప్రాక్టీస్ మ్యాచ్‌లో 30 బంతుల్లో 95 పరుగులు చేశాడని వ్యాఖ్య
Justin Langer : ఐపీఎల్ 2026 సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్ పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. సోమవారం వాంఖడే వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. ఇక మ్యాచ్ అనంతరం విలేకరుల సమావేశంలో లక్నో కోచ్ జస్టిన్ లాంగర్ తమ జట్టు ఓటములపై స్పందించాడు. అదే సమయంలో కెప్టెన్ రిషబ్ పంత్‌కు మద్దతుగా నిలిచాడు.
తాజా మ్యాచ్‌తో కలిపి ఇప్పటి వరకు లక్నో సూపర్ జెయింట్స్ 9 మ్యాచ్‌లు ఆడింది. కేవలం రెండు విజయాలను మాత్రమే నమోదు చేసింది. పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో ఉంది. ఈ క్రమంలో అందరి దృష్టి లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ పైనే పడింది. అతడు నిర్ణయాలు తీసుకోవడంలో తడబడుతున్నాడని విమర్శలు వస్తున్నాయి.
Ashok Dinda : ఎమ్మెల్యేగా విజయం సాధించిన టీమ్ఇండియా క్రికెటర్
ఇక ముంబైతో మ్యాచ్‌లో బ్యాటింగ్ ఆర్డర్‌లో పలు మార్పులను చేశాడు. మిచెల్ మార్ష్‌తో కలిసి జోస్ ఇంగ్లిస్‌ను ఓపెనర్‌గా పంపాడు. ఆపై మూడో స్థానంలో నికోలస్ పూరన్ ను పంపించి, నాలుగో స్థానంలో అతడు బ్యాటింగ్‌కు వచ్చాడు. అయితే.. నాలుగో స్థానంలో బరిలోకి దిగిన పంత్ 10 బంతులు ఎదుర్కొని ఓ ఫోర్, ఓ సిక్స్ సాయంతో 15 పరుగులు మాత్రమే చేసి ఔట్ అయ్యాడు.
ప్రాక్టీస్ మ్యాచ్‌లో దుమ్ములేపాడు
ఈ సీజన్‌లో పంత్ పేలవ ఫామ్‌తో ఇబ్బంది పడుతున్నాడు. ఇదే విషయంపై కోచ్ జస్టిన్ లాంగర్ కు ముంబైతో మ్యాచ్ అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ప్రశ్న ఎదురైంది. ఎల్ఎస్‌జీ కెప్టెన్ రిషబ్ పంత్ రెండు రోజుల క్రితం జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో 30 లేదా 40 బంతుల్లో 95 పరుగులు చేశాడని, అయితే.. మ్యాచ్‌లో దానిని పునరావృతం చేయడంలో విఫలం అయ్యాడని పేర్కొన్నాడు.
‘మేము రెండు రోజుల క్రితం ఇక్కడ ఒక ప్రాక్టీస్ గేమ్ ఆడాము. రిషి (రిషబ్ పంత్) ఖచ్చితమైన తుది స్కోరు నాకు సరిగ్గా గుర్తులేదు. బహుశా 40 లేదా 30 బంతుల్లో 95 పరుగులు చేశాడేమో. దాన్ని పరిగణలోకి తీసుకుంటే.. రిషబ్ పంత్ తన అత్యుత్తమ ఫామ్‌లో ఉన్నట్లుగా అనిపించింది.’ అని లాంగర్ అన్నాడు.
అతడు గొప్ప ఆటగాడని కితాబు ఇచ్చాడు. టెస్టు క్రికెట్‌లో ఐదో స్థానంలో బ్యాటింగ్ చేస్తూ విధ్వంసకర ఇన్నింగ్స్‌లు ఆడడం మనం అంతా చూశామని, అలాగే ఏడు రోజుల విరామం తరువాత రెండు రోజు క్రితం అతడు ఆడిన తీరును పరిగణలోకి తీసుకుంటే ఈ మ్యాచ్‌లో అతడు భారీ ఇన్నింగ్స్ ఆడతాడని భావించామన్నాడు. ఇక బ్యాటింగ్ ఆర్డర్ లో దిగువన బ్యాటింగ్ చేయాలనే పంత్ నిర్ణయాన్ని నిస్వార్థ నిర్ణయం అని చెప్పుకొచ్చాడు.
