Vinesh Phogat : వినేశ్ ఫోగట్ పై అనర్హత వేటు.. మహావీర్ ఫోగట్ కీలక వ్యాఖ్యలు..
భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగట్ స్వర్ణ పతకం సాధించి చరిత్ర సృష్టిస్తుందని అనుకుంటే అనూహ్యంగా ఆమెపై అనర్హత వేటు పడింది.
- Thota Vamshi Kumar
- Updated on- August 7, 2024 / 03:54 PM IST
Mahavir Phogat on Vinesh phogat disqualification in Paris Olympics
Vinesh Phogat – Mahavir Phogat : భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగట్ స్వర్ణ పతకం సాధించి చరిత్ర సృష్టిస్తుందని అనుకుంటే అనూహ్యంగా ఆమెపై అనర్హత వేటు పడింది. ఫైనల్ బౌట్‌కు కొన్ని గంటల ముందు ఆమె పై అనర్హత వేటు పడడంతో యావత్ భారతం దిగ్భ్రాంతికి లోనైంది. నిర్ణీత బరువు కన్నా వినేశ్ 100 గ్రాముల అధికంగా బరువు ఉండడంతో ఒలింపిక్స్ కమిటీ ఆమెను డిస్ క్వాలిఫై చేసింది. ఆమెకు ఇంకొంత సమయం ఇవ్వాలని భారత అధికారుల అభ్యర్థనను ఒలింపిక్స్ అధికారులు తిరస్కరించారు.
వినేశ్ ఫోగట్ అనర్హత పై లెజండరీ రెజ్లర్, ఆమె పెదనాన్న, కోచ్ మహావీర్ ఫోగట్ స్పందించారు. ఏఎన్ఐతో ఆయన మాట్లాడాడు. వాస్తవానికి 50 నుంచి100 గ్రాముల అధిక బరువు ఉన్నప్పటికీ కూడా ఒక రెజ్లర్ పాల్గొనడానికి గతంలో అనుమతించబడిన సందర్భాలు ఉన్నాయన్నారు. ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఆమె పతకాన్ని దేశానికి అందిస్తుందని చెప్పుకొచ్చారు.
Vinesh Phogat : వినేశ్ ఫోగట్‌పై అనర్హత వేటు.. బ్రిజ్ భూషణ్ కుమారుడి స్పందన ఇదే..
‘నేను చెప్పడానికి ఏం లేదు. వినేశ్ ఫోగట్ బంగారు పతకం తీసుకువస్తుందని దేశమంతా ఎదురు చూసింది. ఎవరైనా రెజ్లర్ 50-100 గ్రాముల బరువు ఎక్కువగా ఉన్నా ఆడటానికి అనుమతిస్తారు. అయితే.. అక్కడ రూల్స్ మాత్రం అలా ఉండటంతో అలా జరిగిపోయింది. దేశ ప్రజలెవరూ నిరాశ చెందొద్దు. ఆమె ఏదొక రోజు దేశం కోసం తప్పకుండా పతకం సాధిస్తుంది. ఆమెను తదుపరి ఒలింపిక్స్ కోసం సన్నద్ధం చేస్తా.’ అని మహావీర్ చెప్పారు.
మహిళల ఫ్రీస్టైల్ 50 కేజీల విభాగంలో వినేష్ ఫోగట్ పోటీపడుతోంది. మంగళవారం సెమీఫైనల్లో విజయం సాధించి ఫైనల్ చేరుకుంది. రాత్రికి ఆమె నిర్ణీత బరువు కన్నా రెండు కిలోల బరువు పెరిగింది. బరువు తగ్గించుకునేందుకు అన్న పానియాలను మానేసింది. రాత్రి మొత్తం నిద్ర పోకుండా జాగింగ్, సైకింగ్, స్కిప్పింగ్ వంటివి చేసింది. అయినప్పటికి బరువు కొలిచే పరీక్షల సమయానికి ఆమె నిర్ణీత బరువు కన్నా 100 గ్రాముల అదనపు బరువు కలిగి ఉంది. దీంతో ఆమె అనర్హత వేటు పడింది.
Vinesh Phogat : అనర్హత వేటు.. ఆస్పత్రిలో చేరిన స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగట్..
