Vinesh Phogat : వినేశ్ ఫోగట్‌పై అనర్హత వేటు.. బ్రిజ్ భూషణ్ కుమారుడి స్పందన ఇదే..
పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు ఊహించని షాక్ తగిలింది.

Brij Bhushan son reacts to Vinesh Phogat disqualification from Paris Olympics
Vinesh Phogat disqualification : పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు ఊహించని షాక్ తగిలింది. స్వర్ణం లేదంటే రజత పతకంతో భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగట్ తిరిగి వస్తుందని అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూడగా వారికి నిరాశ తప్పలేదు. కొన్ని గంటల్లో ఫైనల్ మ్యాచ్‌లో బరిలోకి దిగాల్సి ఉండగా ఆమె డిస్ క్వాలిపై అయ్యింది. ఈ విషయాన్ని భారత ఒలింపిక్స్ కమిటీ అధికారికంగా ప్రకటించింది. నిర్ణీత బరువు కన్నా ఫోగట్ 100 గ్రాములు అధిక బరువు ఉండడంతో అనర్హత వేట పడింది.
మహిళల రెజ్లింగ్‌లో 50 కేజీల విభాగంలో ఆమె పోటీపడుతున్న సంగతి తెలిసిందే. అనర్హత వేటు పడడంతో ఫైనల్‌కు చేరుకున్నప్పటికి ఆమె ఎలాంటి పతకం లేకుండానే స్వదేశానికి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. మంగళవారం రాత్రి ఆమె రెండు కేజీల బరువు పెరిగినట్లుగా సమాచారం. దీంతో ఆమె బరువు తగ్గించుకునేందుకు రాత్రి భోజనం చేయకపోగా, మేల్కొని జాగింగ్, సైక్లింగ్, స్కిప్పింగ్ వంటివి చేసింది. అయినప్పటికి నిర్ణీత బరువు కన్నా ఓ 100 గ్రాముల అదనపు బరువు కలిగి ఉంది.
బ్రిజ్‌భూషణ్ సింగ్ కుమారుడి స్పందన..
దీనిపై రెజ్లింగ్ ఫెడరేషన్ మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ కుమారుడు, బీజేపీ ఎంపీ కరణ్ భూషణ్ దీనిపై స్పందించాడు. దేశం మొత్తానికి ఇది తీరని లోటు అని అన్నారు. ఈ విషయాన్ని రెజ్లింగ్ ఫెడరేషన్ లోతుగా పరిశీలిస్తుందన్నారు. తగిన చర్యలు తీసుకుంటుందన్నారు.
Also Read : అనర్హత వేటు.. ఆస్పత్రిలో చేరిన స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగట్..
గతేడాది కొంత మంది మహిళా రెజ్లర్లు అప్పటి బీజేపీ ఎంపీ, రెజ్లింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ లైంగిక వేధింపులకు పాల్పడ్డారని అంటూ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఆ రెజ్లర్లకు మద్దతుగా వినేశ్ ఫోగట్ ఢిల్లీలో పోరాటానికి దిగింది. చాలా రోజుల పాటు ఢిల్లీలో రోడ్లపై పోరాటం చేయడంతో పాటు అక్కడే నిద్ర పోయింది. బజ్‌రంగ్ పునియా, సాక్షి మాలిక్ తదితరులతో కలిసి ఉద్యమాన్ని ఉధృతం చేశారు. తనకు ఇచ్చిన పతకాలను గంగలో కలిపేందుకు కూడా సిద్ధమైన సంగతి తెలిసిందే.
Also Read : శ్రేయస్ అయ్యర్, దూబెలు ఔట్ అయ్యారంటే అర్థం ఉంది.. కోహ్లీ ఇలా ఔట్ అవుతున్నాడంటే..?