శ్రీలంక జాతీయ జట్టుతో కలిసి వన్డే టోర్నమెంట్‌లో ఆడేందుకు వెళ్లిన లసిత్ మలింగ తిరిగి ఐపీఎల్ లో అడుగుపెట్టనున్నాడు.
శ్రీలంక జాతీయ జట్టుతో కలిసి వన్డే టోర్నమెంట్‌లో ఆడేందుకు వెళ్లిన లసిత్ మలింగ తిరిగి ఐపీఎల్ లో అడుగుపెట్టనున్నాడు. బుధవారం వాంఖడే మైదానంలో జరగనున్న కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మ్యాచ్‌తో పునరాగమనం చేసేందుకు వ్యూహాలు సిద్ధం చేసుకున్నాడు.
Read Also : KXIP మ్యాచ్ గెలిచారంటే సంబరాలే..
ఈ సీజన్ ఆరంభంలో మార్చి 30న జరిగిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మ్యాచ్‌లో ఎదురైన ఓటమి పరాభవానికి ధీటైన సమాధానం ఇవ్వాలని ముంబై ఇండియన్స్ ఎదురుచూస్తోంది. ఈ క్రమంలో వాంఖడే మైదానం వేదికగా చాలెంజింగ్ కు సిద్ధమైంది. వయస్సు మాట అటుంచి ఆడిన 3 మ్యాచ్ లలోనే 8 వికెట్లు పడగొట్టి దూసుకెళ్తున్న మలింగను ఎదుర్కోవడం పంజాబ్ జట్టుకు సవాలే.
షెడ్యూల్ మారిపోవడంతో కొలంబో వేదికగా జరగాల్సిన మ్యాచ్ గురువారానికి వాయిదా పడింది. ఈ క్రమంలో బుధవారం కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో మ్యాచ్‌ను ముగించుకుని బుధవారం రాత్రే కొలంబో విమానం ఎక్కేయనున్నాడు మలింగ్. ఇప్పటికే జట్టులో అల్జెరీ జోసెఫ్ సృష్టిస్తోన్న బీభత్సానికి మలింగ తోడైతే పంజాబ్ పని ఇక అంతే.
Read Also : భజ్జీ.. తాహిర్‌లు వైన్ లాంటి వాళ్లు: ధోనీ