Viral Video : దీంతో కూడా ఆడొచ్చని అప్పట్లో తెలిసుంటేనా..? ఎప్పుడో బ్యాడ్మింటన్ ప్లేయర్‌ను అయ్యేవాడిని!
ఒకప్పుడు ఏమోగానీ ఇప్పుడు మాత్రం దేశంలో బ్యాడ్మింటన్‌కు మంచి ఆదరణ లభిస్తోంది.
- Thota Vamshi Kumar
- Published On : March 4, 2024 / 03:07 PM IST
Man plays badminton with Broom in viral video
Viral Video : ఒకప్పుడు ఏమోగానీ ఇప్పుడు మాత్రం దేశంలో బ్యాడ్మింటన్‌కు మంచి ఆదరణ లభిస్తోంది. పీవీ సింధు, సైనా నెహ్వాల్‌లు తమ ఆటతో ఎందరినో మాయ చేశారు. వీరిని స్పూర్తిగా తీసుకుని ఎంతో మంది షటిల్ కాక్ ను అందుకున్నారు. కాగా.. తాజాగా ఓ వ్యక్తి బ్యాడ్మింటన్ ఆడుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే.. అతడు చీపురు పట్టుకుని బ్మాడ్మింటన్ ఆడాడు.
గత వారం ఇన్‌స్టాగ్రామ్‌లో జతిన్ శర్మ అనే యూజర్ ఈ వీడియోను పోస్ట్ చేశాడు. ఈ వీడియోలో ఓ పురుషుడు, స్త్రీ బ్యాడ్మింటన్ ఆడుతున్నారు. కొద్ది సేపటికి ఓ వ్యక్తి కోర్టులోకి వచ్చాడు. అతడు బ్యాడ్మింటన్ రాకెట్‌ను కాకుండా చీపురును పట్టుకుని వచ్చాడు. అతడు ఇచ్చిన ట్విస్ట్ కారణంగా కాసేపు ఆటకు అంతరాయం కలిగింది. బ్యాడ్మింటన్ రాకెట్‌తో ఆడినట్లే ఎంతో నేర్పుగా కాక్ ను అవతలి కోర్టులోకి పంపాడు.
CSK : ఇలాగైతే సీఎస్‌కే కప్ కొట్టడం కష్టమే!.. ఐపీఎల్ ఆరంభం కాకముందే ఇలా..
వీడియో చివరల్లో అతడు ఓ పాయింట్‌ను స్కోర్ చేసినట్లు కనిపించింది. ఈ వీడియో షేర్ చేసినప్పటి నుండి 3.5 మిలియన్ల వీక్షణలను, 1.9 లక్షల లైక్‌లను సంపాదించింది.
అట్టాను చూసి పుస్తకాన్ని అంచనా వేయొద్దని ఒకరు, ఇన్నాళ్లు అనవసరంగా రాకెట్‌ను డబ్బులు పెట్టి కొని వృథా చేశామని ఇంకొకరు, దీనితో కూడా ఆడొచ్చునని తెలిసి ఉంటేనా ఎప్పుడో బ్యాడ్మింటన్ ప్లేయర్‌ను అయ్యేవాడినని మరొకరు ఫన్నీగా కామెంట్లు చేశారు.
