CSK : ఇలాగైతే సీఎస్‌కే క‌ప్ కొట్ట‌డం క‌ష్ట‌మే!.. ఐపీఎల్ ఆరంభం కాక‌ముందే ఇలా..

ఐపీఎల్ 2024 సీజ‌న్‌కు ముందు చెన్నై సూప‌ర్ కింగ్స్ (సీఎస్‌కే)కు భారీ షాక్ త‌గిలింది.

CSK : ఇలాగైతే సీఎస్‌కే క‌ప్ కొట్ట‌డం క‌ష్ట‌మే!.. ఐపీఎల్ ఆరంభం కాక‌ముందే ఇలా..

Massive Blow For CSK

Chennai Super Kings : ఐపీఎల్ 2024 సీజ‌న్‌కు ముందు చెన్నై సూప‌ర్ కింగ్స్ (సీఎస్‌కే)కు భారీ షాక్ త‌గిలింది. ఆ జ‌ట్టు విధ్వంస‌క‌ర ఓపెన‌ర్ డెవాన్ కాన్వే సీజన్ మొద‌టి అర్థ‌భాగానికి దూరం అయ్యాడు. ఆస్ట్రేలియాతో ఇటీవ‌ల జ‌రిగిన టీ20 సిరీస్‌లో కాన్వే గాయ‌ప‌డ్డాడు. అత‌డి ఎడ‌మ బొట‌న వేలికి గాయ‌మైంది. స్కానింగ్ అనంత‌రం వైద్యులు అత‌డికి శ‌స్త్ర చికిత్స అవ‌స‌రం అని తెలిపారు. దీంతో అత‌డు త‌న ఎడ‌మ బొట‌న వేలికి శ‌స్త్ర‌చికిత్స చేయించుకోనున్నాడు.

ఆస్ట్రేలియాతో జరిగే రెండో టెస్టు మ్యాచ్‌కు ముందు న్యూజిలాండ్ క్రికెట్ ఈ మేర‌కు ఓ ప్రకటన‌ను విడుదల చేసింది. ‘ఆస్ట్రేలియాతో జ‌రిగిన టీ20 సిరీస్‌లో కాన్వే ఎడ‌మ చేతి బొట‌న వేలికి గాయ‌మైంది. అనేక స్కాన్‌లు, వైద్యుల స‌ల‌హాతో అత‌డికి స‌ర్జ‌రీ జ‌ర‌గ‌నుంది. శస్త్రచికిత్స నుండి కోలుకోవడానికి అత‌డికి కనీసం 8 వారాల సమయం పడుతుంది.’ అని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు తెలిపింది. ఎనిమిది వారాలు అంటే దాదాపు రెండు నెల‌లు. దీంతో అత‌డు ఐపీఎల్ సీజ‌న్ తొలి అర్ధ‌భాగంలో ఆడ‌డు.

IPL 2024 : కోహ్లి, రోహిత్, గిల్ కానేకాదు.. ఐపీఎల్ 2024లో ఆరెంజ్ క్యాప్ అందుకునేది ఎవ‌రంటే?

ఐపీఎల్ 2024 సీజ‌న్ మార్చి 22న ప్రారంభం కానుంది. ఆరంభ మ్యాచ్‌లో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరుతో చెన్నై సూపర్ కింగ్స్ త‌ల‌ప‌డ‌నుంది. ఐపీఎల్ 2023 సీజ‌న్‌లో చెన్నై విజేత‌గా నిల‌ప‌డంలో కాన్వే కీల‌క పాత్ర పోషించాడు. 51.69 స‌గ‌టు 139.71 స్ట్రైక్ రేటుతో 672 ప‌రుగులు చేశాడు. ఇందులో ఆరు అర్ధ‌శ‌త‌కాలు ఉన్నాయి

రుతురాజ్‌కు జోడీ ఎవ‌రంటే..?
డెవాన్ కాన్వే ఐపీఎల్ 2024 సీజ‌న్ మొద‌టి అర్ధ‌భాగానికి దూరం కావ‌డంతో ఇప్పుడు రుతురాజ్‌కు జోడీగా ఎవ‌రు బ‌రిలోకి దిగుతారు అనే ప్ర‌శ్న ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. అయితే.. వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో అద‌ర‌గొట్టిన న్యూజిలాండ్ ఆట‌గాడు ర‌చిన్ ర‌వీంద్ర‌ను ఓపెన‌ర్‌గా బ‌రిలోకి దింపే అవ‌కాశం ఉంది. మినీ వేలంలో అత‌డిని చెన్నై రూ.1.80 కోట్ల‌కు సొంతం చేసుకుంది.

Rohit Sharma : క్రికెట్ అభిమానుల‌కు షాక్‌.. మాజీ క్రికెట‌ర్ రోహిత్ శ‌ర్మ క‌న్నుమూత‌