IPL 2024 : కోహ్లి, రోహిత్, గిల్ కానేకాదు.. ఐపీఎల్ 2024లో ఆరెంజ్ క్యాప్ అందుకునేది ఎవ‌రంటే?

క్రికెట్ ప్రేమికులు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2024 సీజ‌న్ మరికొద్ది రోజుల్లో ఆరంభం కానుంది.

IPL 2024 : కోహ్లి, రోహిత్, గిల్ కానేకాదు.. ఐపీఎల్ 2024లో ఆరెంజ్ క్యాప్ అందుకునేది ఎవ‌రంటే?

Yuzvendra Chahal Predicts Orange Cap Winner For IPL 2024

IPL 2024 Orange Cap : క్రికెట్ ప్రేమికులు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ (ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్) 2024 సీజ‌న్ మరికొద్ది రోజుల్లో ఆరంభం కానుంది. కాగా.. ఈ సీజ‌న్‌లో అత్య‌ధిక ప‌రుగులు సాధించి ఆరెంజ్ క్యాప్ ను సొంతం చేసుకునేది ఎవ‌రు, అత్య‌ధిక వికెట్లు తీసి ప‌ర్‌పుల్ క్యాప్ ను అందుకునేది ఎవ‌రు అనే విష‌యాల‌పై అందరిలో ఎంతో ఆస‌క్తి నెల‌కొని ఉంది. ఈ విష‌య‌మై టీమ్ఇండియా స్పిన్న‌ర్‌ యుజ్వేంద్ర చ‌హ‌ల్ కు ప్ర‌శ్న ఎదురైంది.

ఆరెంజ్ క్యాప్‌ను అందుకునే ఆట‌గాళ్లు రాజ‌స్థాన్ రాయ‌ల్స్ జ‌ట్టులోని వారే అని చ‌హ‌ల్ అభిప్రాయ‌ప‌డ్డాడు. జోస్ బ‌ట్ల‌ర్ లేదా య‌శ‌స్వి జైస్వాల్‌ల‌లో ఒక‌రు అత్య‌ధిక ప‌రుగుల వీరుడిగా నిలుస్తార‌ని జోస్యం చెప్పాడు. ఇక అత్య‌ధిక వికెట్లు తీసేది మాత్రం తానేన‌న్నాడు. గుజ‌రాత్ టైటాన్ స్పిన్న‌ర్ ర‌షీద్ ఖాన్ రెండో స్థానంలో నిలుస్తాడ‌ని అంచ‌నా వేశాడు. ఈ మేర‌కు త‌న యూట్యూబ్ ఛాన‌ల్‌లో చ‌హ‌ల్ చెప్పాడు.

SRH : స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ కొత్త కెప్టెన్ వ‌చ్చేశాడు.. రూ.20 కోట్ల ఆట‌గాడు రాత‌మారుస్తాడా?

ఆకాశ్ చోప్రా ఆశ్చ‌ర్యం..

ఇటీవ‌ల భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) సెంట్ర‌ల్ కాంట్రాక్టుల జాబితాను ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ జాబితాలో లెగ్ స్పిన్న‌ర్ అయిన చ‌హ‌ల్‌కు చోటు ద‌క్క‌లేదు. దీనిపై మాజీ భార‌త ఓపెన‌ర్ ఆకాశ్ చోప్రా ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. సెంట్ర‌ల్ కాంట్రాక్ట్ నుంచి చ‌హ‌ల్‌ను తొల‌గించ‌డం అంటే సెల‌క్ష‌న్ క‌మిటీ ఇత‌ర ఎంపిక‌ల‌ను ప‌రిశీలిస్తోంద‌ని అత‌డు చెప్పాడు.

‘బీసీసీఐ సెంట్ర‌ల్ కాంట్రాక్ట్‌లో ఛ‌తేశ్వర్ పుజారా, అజింక్యా రహానే, శిఖర్ ధావన్ పేర్లు లేక‌పోవ‌డాన్ని అర్థం చేసుకోగ‌ల‌ను. యూజీ చ‌హల్ పేరు లేకపోవటం కొంత ఆశ్చర్యంగా ఉంది. దీప‌క్ హుడా కు కూడా చోటు ద‌క్క‌లేదు. దీన్ని బ‌ట్టి చూస్తే బీసీసీఐ వేరొక దిశ‌లో చూస్తున్నార‌ని ఇది సూచిస్తోంది.’ అని ఆకాశ్ చోప్రా త‌న యూట్యూబ్ ఛాన‌ల్‌లో పేర్కొన్నాడు.

Rohit Sharma : క్రికెట్ అభిమానుల‌కు షాక్‌.. మాజీ క్రికెట‌ర్ రోహిత్ శ‌ర్మ క‌న్నుమూత‌

మ‌రోవైపు రంజీల్లో ఆడాల‌ని బీసీసీఐ సూచించిన‌ప్ప‌టికీ ఇషాన్ కిష‌న్‌, శ్రేయ‌స్ అయ్య‌ర్‌లు పెడ‌చెవిన పెట్ట‌డంతో వీరిద్ద‌రికి కూడా సెంట్ర‌ల్ కాంట్రాక్ట్‌లో చోటు ద‌క్క‌లేదు. కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి టాప్ గ్రేడ్‌లో ఉన్నారు.