SRH : స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ కొత్త కెప్టెన్ వ‌చ్చేశాడు.. రూ.20 కోట్ల ఆట‌గాడు రాత‌మారుస్తాడా?

అంద‌రూ ఊహించిందే జ‌రిగింది. ఎడెన్ మార్‌క్ర‌మ్‌కు స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ షాకిచ్చింది.

SRH : స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ కొత్త కెప్టెన్ వ‌చ్చేశాడు.. రూ.20 కోట్ల ఆట‌గాడు రాత‌మారుస్తాడా?

Pat Cummins

Sunrisers Hyderabad : అంద‌రూ ఊహించిందే జ‌రిగింది. ఎడెన్ మార్‌క్ర‌మ్‌కు స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ షాకిచ్చింది. అత‌డిని కెప్టెన్సీ బాధ్య‌త‌ల నుంచి త‌ప్పించింది. కొత్త కెప్టెన్‌గా ఆస్ట్రేలియా ఆల్‌రౌండ‌ర్ పాట్ క‌మిన్స్ పేరును ప్ర‌క‌టించింది. ఈ విష‌యాన్ని సోష‌ల్ మీడియా వేదిక‌గా వెల్ల‌డించింది.

డేవిడ్ వార్న‌ర్ నాయ‌క‌త్వంలోని ఎస్ఆర్‌హెచ్ 2016లో ఐపీఎల్ విజేత‌గా నిలిచింది. ఆ త‌రువాత మరోసారి క‌ప్పును సాధించ‌లేదు. దీంతో కొన్నాళ్ల క్రితం వార్న‌ర్ పై వేటు వేసింది. ఆ త‌రువాత నుంచి ఎస్ఆర్‌హెచ్ ప్ర‌ద‌ర్శ‌న క్ర‌మంగా దిగ‌జారుతూ వ‌చ్చింది. వార్న‌ర్ స్థానంలో కివీస్ ఆట‌గాడు కేన్ విలియ‌మ్స‌న్ కెప్టెన్‌గా బాధ్య‌త‌లు చేప‌ట్టిన‌ప్ప‌టికి అనుకున్న ఫ‌లితాలు రాలేదు.

T20 World Cup 2024 : బాబోయ్ అంత రేటా? ఇండియా – పాక్ మ్యాచ్ వీఐపీ టిక్కెట్ ధర రూ.40లక్షలుపైనే..!

ఐపీఎల్ 2022 ఎడిష‌న్‌లో కేన్ సార‌థ్యంలోని ఎస్ఆర్‌హెచ్ ఆరు మ్యాచుల్లో గెలిచి పాయింట్ల ప‌ట్టిక‌లో ఎనిమిదో స్థానంలో నిలిచింది. దీంతో కేన్‌కు బైబై చెప్పింది. అత‌డి స్థానంలో ఎడెన్ మార్‌క్ర‌మ్ సార‌థ్య బాధ్య‌త‌లు అప్ప‌గించింది. ఎస్ఆర్‌హెచ్ ప్ర‌ద‌ర్శ‌న మెరుగ‌వ‌లేదు స‌రికాదా మ‌రింత దిగ‌జారింది. ఐపీఎల్ 2023లో 14 మ్యాచుల్లో నాలుగు మ్యాచుల్లోనే విజ‌యం సాధించి ప‌దో స్థానంలో నిలిచింది.

ఈ క్ర‌మంలో ఐపీఎల్ మినీ వేలంలో ఆసీస్ ఆల్‌రౌండ‌ర్ పాట్ క‌మిన్స్ ను రూ.20.50 కోట్లు వెచ్చించి మ‌రీ సొంతం చేసుకుంది. ఆసీస్‌కు రెండు ఐసీసీ ట్రోఫీలు (ప్ర‌పంచ టెస్టు ఛాంపియ‌న్ షిప్‌, వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ 2023) అందించిన క‌మిన్స్ త‌మ రాత మారుస్తాడ‌ని ఎస్ఆర్‌హెచ్ భావిస్తోంది. ఈ క్ర‌మంలో అత‌డికి కెప్టెన్సీ బాధ్య‌త‌లు అప్ప‌గించింది.

Rohit Sharma : క్రికెట్ అభిమానుల‌కు షాక్‌.. మాజీ క్రికెట‌ర్ రోహిత్ శ‌ర్మ క‌న్నుమూత‌

మార్చి 22 నుంచి ఐపీఎల్ 17వ సీజ‌న్ ఆరంభం కానుంది. హైద‌రాబాద్ త‌మ తొలి మ్యాచ్ ను మార్చి 23న కేకేఆర్‌తో ఆడ‌నుంది.