Manu Bhaker : నీరజ్ చోప్రాతో పెళ్లి.. అవును నేను విన్నాను : మను భాకర్
మను, నీరజ్ చోప్రాలు ప్రేమలో ఉన్నారని, తన కూతురిని పెళ్లి చేసుకోవాలని నీరజ్ ను మను భాకర్ తల్లి కోరినట్లుగా వార్తలు వచ్చాయి.
- Thota Vamshi Kumar
- Published On : August 15, 2024 / 09:01 AM IST
Manu Bhaker Finally Reacts To Her Marriage Rumours With Neeraj Chopra
Manu Bhaker – Neeraj Chopra : పారిస్ ఒలింపిక్స్ 2024లో షూటర్ మను బాకర్ సత్తా చాటింది. రెండు కాంస్య పతకాలను సాధించింది. ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన భారత అథ్లెట్‌గా చరిత్ర సృష్టించింది. ఒలింపిక్స్ ముందు వరకు 22 ఏళ్ల మను గురించి ఎవ్వరికి పెద్దగా తెలియదు. ప్రస్తుతం ఆమె పేరు మారుమోగిపోతుంది. యువతలో మంచి క్రేజ్ ఏర్పడింది. ఆమె ఏం చేసినా, మాట్లాడినా సెన్సేషన్‌గా మారుతోంది.
ఇక ఒలింపిక్స్ ముగిసిన తరువాత భారత జావెలిన్ త్రో స్టార్ నీరజ్ చోప్రాతో ఆమె మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో వీరిద్దరు సిగ్గు పడుతూ మాట్లాడుకున్నట్లుగా కనిపించింది. ఇక ఇదే సమయంలో మను భాకర్ తల్లి నీరజ్‌తో మాట్లాడుతూ తలపై నీరజ్ చేత ఒట్టు తీసుకున్నట్లుగా మరో వీడియోలో కనిపించింది. దీంతో మను, నీరజ్ చోప్రాలు ప్రేమలో ఉన్నారని, తన కూతురిని పెళ్లి చేసుకోవాలని నీరజ్ ను మను భాకర్ తల్లి కోరినట్లుగా వార్తలు వచ్చాయి.
Vinesh Phogat : కోట్లాది మంది భారతీయులకు నిరాశ.. వినేశ్ ఫోగట్ పిటిషన్ కొట్టివేత..
ఇప్పటికే ఈ వార్తలను మనుభాకర్ తండ్రి ఖండించారు. తన కూతురు చిన్న పిల్ల అని, ఆమెకు పెళ్లి చేసే వయసు రాలేదన్నారు. నీరజ్ చోప్రా తమ కొడుకులాంటి వాడని, వారి మధ్య ఎలాంటి రిలేషన్ లేదన్నాడు. తాజాగా ఈ పెళ్లి పుకార్లపై మను భాకర్ స్పందించింది.
సహచర అథ్లెట్‌గా ఎదురుపడినప్పుడు నీరజ్ చోప్రాతో మాట్లాడుతుంటానని, అంతకు మించి తమ మధ్య ఎలాంటి బంధం లేదని స్పష్టం చేసింది. తాను కూడా ఈ రూమర్లను విన్నట్లుగా చెప్పింది. అందుకనే దీనిపై స్పష్టత ఇవ్వాలని అనుకుంటున్నట్లుగా తెలిపింది. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదంది. నీరజ్‌తో తాను మాట్లాడుతున్న సమయంలో ఎవరో తెలియకుండా వీడియో తీశారంది.
తనకు, నీరజ్‌కు మధ్య పెద్దగా ఇంటరాక్షన్ కూడా లేదంది. పోటీలు, ఈవెంట్లలో ఎదురుపడినప్పుడు సరదాగా పలకరించుకుంటామని చెప్పింది. ఇద్దరి మధ్య ఎలాంటి రిలేషన్ లేదంది. ఇక అమ్మ నీరజ్‌తో ఏం మాట్లాడిందో తనకు తెలియదంది. ఎందుకంటే వాళ్లిదరూ మాట్లాడుకున్న సమయంలో తాను అక్కడ లేదు అని మను భాకర్ చెప్పింది.
