T20 World Cup 2024: పాక్‌ను ఓడించిన అమెరికా ప్లేయర్ సౌరభ్ నేత్రవాలాకర్ ఎవరో తెలుసా?

T20 World Cup 2024: ముంబైలో జన్మించిన నేత్రావల్కర్ 2010 ప్రపంచకప్‌లో టీమిండియా అండర్19 జట్టు తరపున కూడా ఆడాడు.

PIC Credit: @ICC

టీ20 ప్రపంచకప్ 2024లో పాక్‌పై అమెరికా విజయ దుందుభి మోగించింది. అమెరికాలోని డల్లాస్‌లో జరిగిన మ్యాచులో పాక్‌పై అమెరికా సూపర్ ఓవర్ లో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 20 ఓవర్లలో 159/7 పరుగులు బాదింది.

ఆ తర్వాత అమెరికా కూడా 20 ఓవర్లలో 159/3 పరుగులు చేసింది. మ్యాచ్ టై కావడంతో సూపర్ ఓవర్ నిర్వహించారు. ఇందులో అమెరికా స్కోరు 18/1గా నమోదైంది. పాకిస్థాన్ కేవలం 13/1 స్కోరు మాత్రమే చేయడంతో అమెరికా గెలిచింది. ఈ సూపర్ ఓవర్‌లో పాకిస్థాన్ ను ఓడించిన బౌలర్ సౌరభ్ నేత్రవాలాకర్.

భారత సంతతి ప్లేయర్. 1991న అక్టోబర్ 16న ముంబైలో జన్మించిన నేత్రావల్కర్ 2010 ప్రపంచకప్‌లో టీమిండియా అండర్19 జట్టు తరపున కూడా ఆడాడు. భారత్ లో క్రికెట్లో విపరీతంగా పోటీ ఉండడంతో ఇక్కడ ఎదగలేకపోయాడు. ఈ ఎడమచేతి వాటం పేసర్ ఎలాంటి పిచ్ లోనైనా బౌన్స్ చేయగలడు. గురువారం జరిగిన మ్యాచులో ఈ ప్రతిభనే కనబర్చి పాకిస్థాన్‌ను ఓడించాడు.

అతడు 2015లో అమెరికాకు వెళ్లాడు. ఇప్పుడు అమెరికా జట్టు తరఫున ఆడుతూ అదరగొట్టేశాడు. నేత్రవల్కర్ అప్పట్లో ముంబై తరఫున రంజీ ట్రోఫీలోనూ ఆడాడు. కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, హర్షల్ పటేల్, జయదేవ్ ఉనద్కత్, సందీప్ శర్మ వంటి వారు అతడి టీమ్‌మేట్లే. నేత్రవల్కర్ క్రికెటర్ మాత్రమే కాదు.. ఓ ఇంజనీర్ కూడా. ఒరాకిల్‌లో సీనియర్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తూనే క్రికెట్లో రాణించేవాడు.

Also Read : ఏమ‌య్యా వార్న‌ర్.. ఎటు పోతున్న‌వ్..? అరె నీకే చెప్పేది..!

ట్రెండింగ్ వార్తలు