Kieron Pollard : హార్దిక్ పాండ్యాకు అన్నీ ఇచ్చాము.. కానీ.. కీరన్ పొలార్డ్ సంచలన వ్యాఖ్యలు..
రాజస్థాన్‌తో మ్యాచ్ అనంతరం బ్యాటింగ్ కోచ్ కీరన్ పొలార్డ్ (Kieron Pollard) చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
- Thota Vamshi Kumar
- Updated on- May 25, 2026 / 10:22 AM IST
MI batting coach Kieron Pollard comments on Hardik Pandya captaincy (pic credit@ipl)
- ఓటమితో ఐపీఎల్ 2026 సీజన్‌ను ముగించిన ముంబై
- హార్దిక్ పాండ్యా నాయకత్వంపై విమర్శలు
Kieron Pollard : ఐపీఎల్ 2026 సీజన్‌ను ముంబై ఇండియన్స్ ఓటమితోనే ముగించింది. ఆదివారం ముంబైలోని వాంఖడే వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 30 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఈ సీజన్‌లో హార్దిక్ పాండ్యా సారథ్యంలో 14 లీగ్ మ్యాచ్‌లు ఆడిన ముంబై జట్టు నాలుగు మ్యాచ్‌ల్లోనే విజయం సాధించింది. పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంతో నిలిచి సీజన్‌ను ముగించింది.
ఈ సీజన్‌లో కెప్టెన్‌గానే కాకుండా ఆల్‌రౌండర్‌గా హార్దిక్ పాండ్యా ఘోరంగా విఫలం అయ్యాడు. దీంతో అతడిని కెప్టెన్సీ నుంచి తప్పించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. మరోవైపు మేనేజ్‌మెంట్ సైతం హార్దిక్ నాయకత్వం పై సంతృప్తిగా లేదని సమాచారం. ఆదివారం రాజస్థాన్‌తో మ్యాచ్ అనంతరం బ్యాటింగ్ కోచ్ కీరన్ పొలార్డ్ చేసిన వ్యాఖ్యలు ఇందుకు బలాన్ని చేకూరుస్తున్నాయి.
KL Rahul : కేఎల్ రాహుల్ నువ్వు మామూలోడివి కాదయ్యా.. ఐపీఎల్‌లో ‘సిక్సర్ల కింగ్’ వి..
కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా ఆకట్టుకోలేకపోయాడని పొలార్డ్ తెలిపాడు. మేనేజ్‌మెంట్ పెట్టుకున్న అంచనాలను అందుకోలేకపోయాడని తెలిపాడు. కెప్టెన్‌గా అతడు రాణించడానికి తాము అన్ని విధాలుగా సహకరించామని చెప్పాడు. ఓటమికి ఒక్కడినే బాధ్యుడిని చేయాలని అనుకోవడం లేదని, ఇది జట్టు సమిష్టి వైఫల్యం అని అన్నాడు.
కొన్నిసార్లు గెలుస్తాం, కొన్నిసార్లు ఓడిపోతాం. ఏదీఏమైనప్పటికి కూడా కూడా కొన్ని విషయాలను తాను ప్రశ్నించనని చెప్పాడు. ఈ సీజన్‌లో ఏదీ వర్కౌట్ కాలేదు. కొందరు ఆటగాళ్లు గాయాలతో బాధపడుతున్నారు. వీరంతా గాయాల నుంచి కోలుకుని వచ్చే సీజన్‌లో బలంగా తిరిగి వస్తారని ఆశిస్తున్నాము. అని పొలార్డ్ తెలిపాడు.
ఇక వచ్చే సీజన్‌కు ముందు ముంబై ఇండియన్స్ జట్టులో మార్పులు జరుగుతాయని పొలార్డ్ తెలిపాడు. అయితే.. తొందరపాటు నిర్ణయాలను తీసుకోబోమని స్పష్టం చేశాడు. ఎక్కడ పొరపాటు జరిగిందో కూర్చుని విశ్లేషణ చేసుకుంటామని, ఇందుకు కొంత సమయం కావాలన్నాడు.
