Vaibhav Sooryavanshi : చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ.. బ్యాటింగ్‌లో కాదు.. ఈ సారి ఫీల్డింగ్‌లో..
రాజస్థాన్ రాయల్స్ యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ (Vaibhav Sooryavanshi) అరుదైన ఘనత సాధించాడు.
Vaibhav Sooryavanshi creates history Youngest fielders to take an IPL catch (pic credit@ ipl)
- ఐపీఎల్లో తొలి క్యాచ్ అందుకున్న వైభవ్ సూర్యవంశీ
- అతి పిన్న వయస్కుడైన ప్లేయర్‌గా రికార్డు
Vaibhav Sooryavanshi : రాజస్థాన్ రాయల్స్ యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్ చరిత్రలో తొలి క్యాచ్ పట్టిన అతి పిన్న వయస్కుడైన ఫీల్డర్‌గా చరిత్ర సృష్టించాడు. ఆదివారం వాంఖడే వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ర్యాన్ రికెల్టన్ క్యాచ్ అందుకోవడంతో వైభవ్ ఈ ఘనత సాధించాడు.
ఈ క్రమంలో అతడు బంగ్లాదేశ్ ఆటగాడు ముజీబ్ ఉర్ రెహమాన్ ను అధిగమించాడు. ముజీబ్ 2018 ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ తరుపున ఆడుతూ ఆర్సీబీపై 17 ఏళ్ల 16 రోజుల వయసులో ఈ ఘనత సాధించాడు. ఇక వైభవ్ విషయానికి వస్తే.. 15 ఏళ్ల 58 రోజుల వయసులోనే ఐపీఎల్లో తొలి క్యాచ్ అందుకున్నాడు.
Riyan Parag : మమ్మల్ని ఇంటికి పోకుండా కాపాడింది అతడే.. రియాన్ పరాగ్ హాట్ కామెంట్స్..
ఇన్నాళ్లు వైభవ్ సూర్యవంశీని ఎక్కువగా ఇంపాక్ట్ ప్లేయర్‌గానే ఆడించారు. అతడిని కేవలం బ్యాటర్‌గానే తీసుకునేవారు. తొలిసారి పూర్తి స్థాయి జట్టు సభ్యుడిగా అవకాశం రాగా.. ఐపీఎల్లో తొలి క్యాచ్ అందుకుని చరిత్ర సృష్టించాడు.
ఐపీఎల్లో క్యాచ్ పట్టిన అతి పిన్న వయస్కులైన ఫీల్డర్లు వీరే..
* వైభవ్ సూర్యవంశీ (రాజస్థాన్ రాయల్స్) – 15 ఏళ్ల 58 రోజులు (ముంబై పై ఐపీఎల్ 2026లో)
* ముజీబ్ ఉర్ రెహమాన్ (పంజాబ్ కింగ్స్) – 17 ఏళ్ల 16 రోజులు (ఆర్సీబీపై ఐపీఎల్ 2018లో)
* రియాన్ పరాగ్ (రాజస్థాన్ రాయల్స్) – 17 ఏళ్ల 163 రోజులు (ఢిల్లీ పై ఐపీఎల్ 2019లో)
* ప్రదీప్ సంగ్వాన్ (ఢిల్లీ క్యాపిటల్స్) – 17 ఏళ్ల 181 రోజులు – (ముంబై పై ఐపీఎల్ 2008లో)
* వాషింగ్టన్ సుందర్ (రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్) – 17 ఏళ్ల 201 రోజులు – (ముంబై పై ఐపీఎల్ 2017లో)
ఇక ఈ మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ విఫలం అయ్యాడు. 6 బంతులు ఎదుర్కొని 4 పరుగులు మాత్రమే చేశాడు. అయినప్పటికి కూడా ముంబై పై రాజస్థాన్ విజయం సాధించి ప్లేఆఫ్స్‌లో అడుగుపెట్టింది.
