RR-MI : ముంబై, రాజ‌స్థాన్‌ల మ‌ధ్య ట్రేడ్ డీల్ చర్చ‌లు.. హార్దిక్‌ను ఇచ్చి ఆర్ఆర్ స్టార్ ఓపెన‌ర్ కోసం ఎంఐ తీవ్ర ప్ర‌య‌త్నాలు!

ముంబైఇండియ‌న్స్‌, రాజ‌స్థాన్ రాయ‌ల్స్ జ‌ట్ల (RR-MI ) మ‌ధ్య ట్రేడ్ డీల్‌కు సంబంధించిన చ‌ర్య‌లు జ‌రుగుతున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి.

MI Talks With RR For Hardik Pandya Trade Deal But Want Yashasvi Jaiswal In Return

  • ముంబైఇండియ‌న్స్‌, రాజ‌స్థాన్ రాయ‌ల్స్ జ‌ట్ల మ‌ధ్య ట్రేడ్ డీల్‌
  • హ‌ర్దిక్‌ను వ‌దులుకునేందుకు సిద్ధ‌మైన ఎంఐ
  • బ‌దులుగా స్టార్ ఓపెన‌ర్ కోసం ఆరాటం

RR-MI : ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో అటు బ్యాట‌ర్‌గానే కాకుండా ఇటు కెప్టెన్‌గానూ ఘోరంగా విఫ‌లం అయ్యాడు హార్దిక్ పాండ్యా. దీంతో అత‌డి భ‌విష్య‌త్తుపై ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌లు మొదలు అయ్యాయి. జట్టులోని అంతర్గత పరిస్థితులు, నాయకత్వంపై వచ్చిన విమర్శల నేపథ్యంలో హార్దిక్ కొత్త జట్టులోకి వెళ్లాలని భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై అటు హార్దిక్ గానీ, ఇటు ముంబై గానీ స్పందించ‌లేదు. అయితే.. తాజాగా మ‌రో వార్త చ‌ల్‌హ‌ల్ చేస్తోంది.

ముంబై ఇండియ‌న్స్‌, రాజ‌స్థాన్ రాయ‌ల్స్ జ‌ట్ల మ‌ధ్య ట్రేడ్ డీల్ కు సంబంధించిన చ‌ర్య‌లు జ‌రుగుతున్నాయ‌ట‌. హార్దిక్‌ను రాజ‌స్థాన్‌కు ఇచ్చి ఓపెన‌ర్ య‌శ‌స్వి జైస్వాల్‌ను తీసుకోవాల‌ని ముంబై భావిస్తున్న‌ట్లు స‌ద‌రు వార్త‌ల సారాంశం. మ‌రోవైపు య‌శ‌స్వి జైస్వాల్ కూడా జ‌ట్టు మార్పుపై ఆలోచిస్తున్నాడ‌ని అంటున్నారు. సంజూ శాంస‌న్ త‌రువాత జైస్వాల్‌కే రాజ‌స్థాన్ నాయ‌క‌త్వ బాధ్య‌త‌లు అప్ప‌గిస్తార‌ని భావించిన‌ప్ప‌టికి కూడా రియాన్ ప‌రాగ్‌కు ఆ బాధ్య‌త‌ల‌ను అప్ప‌గించిన సంగ‌తి తెలిసిందే.

Akash Deep : మొద‌లైన టీమ్ఇండియా క్రికెట‌ర్‌ ఆకాశ్ దీప్ పెళ్లి వేడుక‌లు.. ఈ పేస‌ర్ చేసుకోబోయే అమ్మాయి ఎవ‌రంటే?

మ‌రోవైపు వైభ‌వ్ సూర్య‌వంశీ రాక‌తో య‌శ‌స్వి జైస్వాల్ ప్ర‌భ త‌గ్గింద‌ని అంటున్నారు. ఇంకొన్నాళ్ల పాటు ఇలాగే కొన‌సాగితే అత‌డి చ‌రిష్మా మ‌రింత త‌గ్గే ప్ర‌మాదం లేక‌పోలేదు అని క్రికెట్ వ‌ర్గాలు వెల్ల‌డిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో య‌శ‌స్వి కొత్త జ‌ట్టులోకి వెళ్లాల‌ని ఆలోచిస్తున్న‌ట్లు స‌మాచారం. దేశ‌వాళీ క్రికెట్‌లో ముంబైకి ఆడుతున్న జైస్వాల్‌.. ఐపీఎల్‌లోనూ ముంబైకి వెళ్ల‌డమే మంచిద‌ని భావిస్తున్నాడు.

మరోవైపు ముంబై ఇండియన్స్‌కు చెందిన సూర్యకుమార్ యాదవ్ కూడా కొత్త అవకాశాల కోసం ఎదురుచూస్తున్నాడని ప్రచారం సాగుతోంది. రోహిత్ శర్మ కెరీర్ చివరి దశకు చేరుకుంటుండగా.. హార్దిక్, సూర్యకుమార్ వంటి కీలక ఆటగాళ్లు జట్టును వీడితే ముంబై కొత్త తరం స్టార్‌లను తయారుచేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అలాంటి సమయంలో జైస్వాల్ వంటి యువ ప్రతిభావంతుడిని జట్టులోకి తీసుకురావడం ముంబై భవిష్యత్ ప్రణాళికల్లో కీలక నిర్ణయంగా మారే అవకాశం ఉందని క్రికెట్ వ‌ర్గాలు చెబుతున్నాయి.