MI vs RCB WPL 2023 : బెంగళూరుపై ముంబై ఘనవిజయం, హేలీ ధనాధన్ బ్యాటింగ్

ముంబై జట్టు అదరగొట్టింది. బెంగళూరుపై ఘన విజయం సాధించింది. మరో 34 బంతులు మిగిలి ఉండగానే.. 9 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది. 155 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై.. 14.2 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 159 పరుగులు చేసి గెలుపొందింది.

MI vs RCB WPL 2023 : విమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) టోర్నీలో ముంబై ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో ముంబై జట్టు అదరగొట్టింది. బెంగళూరుపై ఘన విజయం సాధించింది. మరో 34 బంతులు మిగిలి ఉండగానే.. 9 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది. 155 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై.. 14.2 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 159 పరుగులు చేసి గెలుపొందింది.

ముంబై జట్టులో ఓపెనర్ హేలీ మ్యాథ్యూస్ దంచికొట్టింది. 38 బంతుల్లోనే 77 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచింది. ఆమె స్కోర్ లో 13 ఫోర్లు, ఒక సిక్స్ ఉన్నాయి. నాట్ స్కీవర్ కూడా హాఫ్ సెంచరీతో చెలరేగింది. 29 బంతుల్లోనే 55 పరుగులతో నాటౌట్ గా నిలిచింది. తొలుత బౌలింగ్ లో మెరిసిన హేలీ.. తర్వాత బ్యాటింగ్ లోనూ దుమ్ము రేపింది. 4 ఓవర్లు వేసిన హేలీ 28 పరుగులు ఇచ్చి 3 వికెట్లు పడగొట్టింది.

Also Read..Viral Video: మైదానంలో ఢిల్లీ క్యాపిటల్స్ వైస్ కెప్టెన్ జెమిమా రోడ్రిగ్స్ డ్యాన్స్.. అదుర్స్

156 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన ముంబై.. ఆరంభం నుంచే దూకుడుగా ఆడింది. ముఖ్యంగా ఓపెనర్ హేలీ మాథ్యూస్ శివమెత్తింది. బెంగళూరు బౌలర్లను బెంబేలెత్తించింది. బౌండరీల వరద పారించింది. మరో ఎండ్ లో నాట్ స్కీవర్ కూడా చెలరేగింది. రెచ్చిపోయి బ్యాటింగ్ చేసింది. వీళ్లిద్దరూ ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడ్డారు. దీంతో 14.2 ఓవర్లలోనే ముంబై జట్టు లక్ష్యాన్ని చేధించింది. బెంగళూరుపై ఈజీ విక్టరీ కొట్టింది.

Also Read..UP vs GG Women WPL 2023 : వాటే మ్యాచ్.. గుజరాత్‌పై యూపీ థ్రిల్లింగ్ విక్టరీ, సింగిల్ హ్యాండ్‌తో గెలిపించిన గ్రేస్

ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు మొదట బ్యాటింగ్ చేసింది. 18.4 ఓవర్లలోనే 155 పరుగులకు ఆలౌట్ అయ్యింది.