Mirabai Chanu : కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌కు తొలి స్వర్ణాన్ని అందించిన మీరాబాయి చాను
గ్లాస్లో వేదికగా జరుగుతున్న 2026 కామన్వెల్త్ గేమ్స్‌లో (Mirabai Chanu ) భారత్‌కు తొలి స్వర్ణ పతకం లభించింది.
- Thota Vamshi Kumar
- Published on- July 26, 2026 / 10:01 PM IST
Mirabai Chanu shatters records and wins Indias first gold of 2026 CWG
Mirabai Chanu : గ్లాస్లో వేదికగా జరుగుతున్న 2026 కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌కు తొలి స్వర్ణ పతకం లభించింది. మహిళల వెయిట్ లిఫ్టింగ్ 48 కేజీల విభాగంలో మీరాబాయి చాను 190 కేజీల బరువు ఎత్తి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. నైజీరియాకు చెందిన అసుక్వో న్యోంగ్ 168 కేజీలు ఎత్తి రజత పతకం సొంతం చేసుకోగా మలేషియాకు చెందిన ఐరీన్ జేన్ హెన్రీ 167 కేజీలు ఎత్తి కాంస్య పతకాన్ని సాధించింది.
కాగా.. కామన్వెల్త్ గేమ్స్‌లో మీరాబాయి చానుకు ఇది వరుసగా మూడో స్వర్ణ పతకం కావడం విశేషం. గోల్డ్ కోస్ట్ వేదికగా 2018లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో, 2022లో బర్మింగ్‌హామ్ వేదికగా జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌ల్లోనూ ఆమె గోల్డ్ మెడల్స్‌ను సాధించింది. ఈ క్రమంలో కామన్వెల్త్ గేమ్స్‌ల్లో హ్యాట్రిక్ గోల్డ్ మెడల్స్ సాధించిన మూడో భారత అథ్లెట్‌గా మీరాబాయి చాను రికార్డులకు ఎక్కింది. రెజర్లు సుశీల్ కుమార్ (2010, 2014, 2018), వినేశ్ ఫొగాట్ (2014, 2018, 2022)లు మీరా కన్నా ముందు ఈ ఘనత సాధించారు.
IND vs ZIM : మూడో టీ20లో భారత్ ఘన విజయం.. జింబాబ్వేతో సిరీస్ క్లీన్ స్వీప్
A hat-trick of GOLD medals! 🥇🥇🥇
Congratulations to @mirabai_chanu on clinching the Gold medal at the Glasgow Commonwealth Games.
Your unwavering dedication, remarkable consistency, and extraordinary strength continue to make India proud on the global stage. 🇮🇳#Cheer4Bharat pic.twitter.com/CU6j7ltXlU
— Dr Mansukh Mandaviya (@mansukhmandviya) July 26, 2026
స్నాచ్ విభాగంలో తొలి ప్రయత్నంలో విఫలమైన ఛాను రెండో ప్రయత్నంలో 82 కేజీల బరువు ఎత్తింది. ఇక మూడో ప్రయత్నంలో 85 కేజీల బరువు ఎత్తి కామన్వెల్త్ గేమ్స్‌లో స్నాచ్ విభాగంలో సరికొత్త రికార్డును నెలకొల్పింది. ఆ తరువాత క్లీన్ అండ్ జెర్క్‌లో తొలి ప్రయత్నంలో విఫలమైనా రెండో ప్రయత్నంలో సునాయసంగా 105 కేజీల బరువును ఎత్తి సరికొత్త చరిత్ర సృష్టించి బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది.
