Olympics : 20 ఏళ్ల భారత్ నిరీక్షణ… రజతాన్ని ముద్దాడిన మీరాబాయి

1948 సంవత్సరం నుంచి ఒలింపిక్స్ క్రీడల్లో వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో భారతదేశం సాధించింది ఒక్క మెడలే. అప్పటి నుంచి ఇప్పటి వరకు పతకం సాధించలేకపోయారు క్రీడాకారులు. వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో వండర్ క్రియేట్ చేశారు మీరాబాయి చాను. ఇప్పుడు మీరాబాయ్‌ చాను రెండో పతకంతో మెరిసింది.

Mirabai Chanu : ఒక సంవత్సరం కాదు..రెండు సంవత్సరాలు కాదు..ఏకంగా 20 ఏళ్ల నిరీక్షణ…1948 సంవత్సరం నుంచి ఒలింపిక్స్ క్రీడల్లో వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో భారతదేశం సాధించింది ఒక్క మెడలే. అప్పటి నుంచి ఇప్పటి వరకు పతకం సాధించలేకపోయారు క్రీడాకారులు. వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో వండర్ క్రియేట్ చేశారు మీరాబాయి చాను. ఇప్పుడు మీరాబాయ్‌ చాను రెండో పతకంతో మెరిసింది.

Read More : Mirabai Chanu : పట్టుదలే ఫలితానిచ్చింది, మీరాబాయి చాను గెలిచింది..

టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ శుభారంభం చేసింది. భారత్‌ తొలి పతకాన్ని సాధించింది. వెయిట్ లిఫ్టింగ్‌లో మీరాబాయి చాను చరిత్ర సృష్టించారు. ఆమెకు రజత పతకం లభించింది. 49 కిలోల విభాగంలో మీరాబాయి చానుకు రజతం లభించింది. కరణం మల్లీశ్వరి తర్వాత ఒలంపిక్స్‌లో పతకం సాధించిన రెండో వెయిట్‌లిఫ్టర్‌ మీరాబాయి చానూనే… టోక్యో ఒలంపిక్స్‌కు భారత్‌ తరపున అర్హత సాధించిన ఏకైన లిఫ్టర్‌ మీరాబాయ్‌ చాను. మెడల్‌ సాధించడమే లక్ష్యంగా ఆమె బరిలోకి దిగింది. గెలుస్తానని ధీమా వ్యక్తం చేసింది. తన కలను నెరవేర్చుకుంది.

Read More : Tokyo Olympics 2020: ఒలింపిక్స్‌లో ఖాతా తెరిచిన భారత్.. మీరాబాయి చానుకు రజత పతకం

20 ఏళ్ల నిరీక్షణకు తెరదించింది. 1948లండన్ ఒలంపిక్స్‌లో జరిగిన వెయిట్‌లిఫ్టింగ్‌ పోటీల్లో భారత్‌ తొలిసారి పోటీ పడింది. అప్పటి నుంచి ఇప్పటివరకూ ఈ మెగా ఈవెంట్‌లో వెయిట్‌లిప్టింగ్‌లో భారత్‌ ఇప్పటివరకూ సాధించింది ఒక్క మెడలే… ఇప్పుడు మీరాబాయ్‌ చాను రెండో పతకంతో మెరిసింది. గత ఏప్రిల్‌లో జరిగిన ఆసియా ఛాంపియన్‌షిప్‌లో క్లీన్‌ అండ్‌ జెర్క్‌లో 119 కేజీలతో మీరాబాయి ప్రపంచ రికార్డు నెలకొల్పి అంచనాలు పెంచింది. అదే ప్రదర్శనను పునరావృతం చేసి స్నాచ్‌లోనూ రాణించి పతకాన్ని అందుకుంది.

Read More : Tokyo Olympics : ఆర్చ‌రీలో విభాగంలో క్వార్ట‌ర్ ఫైన‌ల్‌,ఎయిర్ పిస్ట‌ల్ లో ఫైన‌ల్‌ కు భారత్ క్రీడాకారులు

2016లో జరిగిన రియో ఒలింపిక్ పోటీలలో చాను పాల్గొంది కానీ అప్పుడు విఫలం అయ్యింది. అప్పటి నుంచి మరింత పట్టుదలతో గట్టిగా కృషి చేసి ఈసారి రజత పతకం సాధించి భారత్‌కు గర్వకారణంగా నిలిచింది చాను.

 

ట్రెండింగ్ వార్తలు