Asian Games : ఆసియా క్రీడ‌ల్లో అద్భుతం..! పోగొట్టుకున్న‌ఫోన్ కోసం.. రాత్రంతా ప‌ది వేల‌కు పైగా చెత్త సంచుల‌ను వెతికి మ‌రీ..

ఓ అతిథి ఫోన్ పోగొట్టుకోవ‌డంతో దాన్ని స‌వాల్‌గా తీసుకున్న వాలంటీర్లు 10 వేల సీట్ల సామ‌ర్థ్యం గ‌ల స్టేడియంలో రాత్రంతా చెత్త బుట్ట‌ల‌ను వెతికి 24 గంట‌లు గ‌డ‌వ‌క‌ముందే ఫోన్ ఆమె చేతికి అందించారు.

Miracle at Asian Games 2023

Miracle at Asian Games  : మాన‌వ జీవితంలో ఫోన్ ఒక భాగ‌మైంది. ఓ ఐదు నిమిషాలు ఫోన్ క‌న‌బ‌డ‌పోతే చాలు ఏదో కోల్పోయిన‌ట్లుగా భావిస్తుంటారు. అలాంటిది ఫోన్ పోతే.. ఆ బాధ చెప్ప‌లేనిది. ఓ అతిథి ఫోన్ పోగొట్టుకోవ‌డంతో దాన్ని స‌వాల్‌గా తీసుకున్న వాలంటీర్లు 10 వేల సీట్ల సామ‌ర్థ్యం గ‌ల స్టేడియంలో రాత్రంతా చెత్త బుట్ట‌ల‌ను వెతికి 24 గంట‌లు గ‌డ‌వ‌క‌ముందే ఫోన్ ఆమె చేతికి అందించారు. ఈ ఘ‌ట‌న ఆసియా క్రీడ‌ల్లో (Asian Games) చోటు చేసుకుంది.

చైనాలోని హాంగ్జౌ న‌గ‌రంలో ఆసియా క్రీడ‌లు జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ కీడ్ర‌ల్లో పాల్గొనేందుకు హాంకాంగ్ కు చెందిన 12 ఏళ్ల చెస్ క్రీడాకారిణి లియు టియాన్-యి వ‌చ్చింది. అయితే.. ఆమె మొబైల్ ఫోన్‌ క‌న‌బ‌డ‌కుండా పోయింది. ఫోన్ చేస్తే స్విచ్ఛాఫ్ అని వ‌స్తోంది. దీంతో ఆమె త‌న ఫోన్ ఇక పోయిన‌ట్లేన‌ని బాధ‌ప‌డింది. కాగా..ఆ ఫోన్‌ను క‌నిపెట్టేందుకు వాలంటీర్ల బృందం రంగంలోకి దిగింది. అయితే.. దాదాపు 10,000 సీట్లతో 5,23,000 చదరపు మీటర్ల స్టేడియంలో స్విచ్చాఫ్ అయిన‌ మొబైల్ ఫోన్‌ను గుర్తించడం సాధ్య‌మ‌య్యే ప‌నేనా అనే అనుమానం మాత్రం ఉంది.

Mushfiqur Rahim : విచిత్ర రీతిలో ఔటైన బంగ్లాదేశ్ బ్యాట‌ర్‌.. వీడియో వైర‌ల్‌

వాలంటీర్ల బృందం రాత్రంతా పదివేలకు పైగా చెత్త సంచులను మొత్తం వెతికారు. చివ‌ర‌కు ఓ చెత్త సంచిలో లియు టియాన్-యి ఫోన్‌ను క‌నుగొన్నారు. ఆ ఫోను పొగొట్టుకున్న 24 గంట‌ల కంటే త‌క్కువ స‌మ‌యంలో తిరిగి ఆమెకు అందించారు. “మిషన్ పూర్తయింది. దాదాపు 10,000 సీట్లతో 523,000 చదరపు మీటర్ల స్టేడియంలో స్విచ్ఛాఫ్ చేసిన‌ మొబైల్ ఫోన్‌ను గుర్తించడం అసాధ్యం అనిపిస్తుంది. అయితే.. హాంగ్‌జౌ ఆసియా క్రీడలు దానిని సాకారం చేశాయి. వాలంటీర్ల బృందం రాత్రంతా పదివేల చెత్త సంచులను జల్లెడ పట్టింది. హాంకాంగ్‌కు చెందిన చెస్ క్రీడాకారిణి అయిన 12 ఏళ్ల లియు టియాన్-యి తన పోగొట్టుకున్న పరికరాన్ని కనుగొనడంలో సహాయపడింది. ఇది 24 గంటలలోపు పూర్తయింది.” అని హాంగ్‌జౌ ఆసియా క్రీడల అధికారిక హ్యాండిల్ ఓ ట్వీట్ లో పేర్కొంది. ఈ ట్వీట్ వైర‌ల్‌గా మారింది.

ట్రెండింగ్ వార్తలు