Mohammad Nabi : హార్దిక్ పాండ్యపై నబీ అసంతృప్తి..! ఇన్‌స్టా పోస్ట్ వైరల్
హార్దిక్ కెప్టెన్సీ పై అసంతృప్తితో ఉన్నారు అని మహ్మద్ నబీ పోస్ట్‌తో మరోసారి తెరపైకి వచ్చింది.
- Thota Vamshi Kumar
- Published On : April 19, 2024 / 05:12 PM IST
Mohammad Nabi Shares Fans Instagram Post Slamming Hardik Pandya
Mohammad Nabi – Hardik Pandya : ఐపీఎల్ 2024 సీజన్‌కు ముందు ఐదు సార్లు కప్పును అందించిన హిట్‌మ్యాన్ రోహిత్ శర్మను నాయకత్వ బాధ్యతల నుంచి తప్పించి హార్దిక్ పాండ్యకు కెప్టెన్సీ అప్పగించింది ముంబై ఇండియన్స్ యాజమాన్యం. ఈ నిర్ణయం పై ఇప్పటికి కూడా అభిమానుల్లో అసంతృప్తి ఉంది. అయితే.. జట్టులోకి కొందరు సీనియర్లు సైతం హార్దిక్ కెప్టెన్సీ పై అసంతృప్తితో ఉన్నారు అని మహ్మద్ నబీ పోస్ట్‌తో మరోసారి తెరపైకి వచ్చింది.
‘మీ కెప్టెన్ (ముంబై) తీసుకునే కొన్ని నిర్ణయాలు ఎంతో ఆశ్చర్యకరంగా ఉన్నాయి. ఈ రోజు మ్యాచ్‌లో నబీ బౌలింగ్ చేయలేదు. అయినప్పటికీ కీలక సమయాల్లో రెండు క్యాచ్‌లు, ఓ రనౌట్ చేసి ముంబై గెలుపులో కీలక పాత్ర పోషించాడు.’ అని ఓ అభిమాని చేసిన పోస్ట్‌ను తన ఇన్‌స్టా స్టోరీలో పెట్టుకున్నాడు నబీ. హార్దిక్ కెప్టెన్సీ పై నబీ అసంతృప్తితో ఉన్నాడని అందుకనే అభిమాని పోస్ట్‌ను ఇన్‌స్టా స్టోరీగా పెట్టుకుని తన అసంతృప్తిని తెలియజేశాడని నెటిజన్లు అంటున్నారు.
ఏం జరిగిందంటే..?
ముల్లన్‌పూర్‌లో పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై జట్టు తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్ (53 బంతుల్లో 78 పరుగులు), తిలక్ వర్మ (18 బంతుల్లో 34 పరుగులు) రాణించారు. అనంతరం పంజాబ్ కింగ్స్ 19.1 ఓవర్లలో 183 పరుగులకు ఆలౌటైంది. ఈ మ్యాచ్‌లో ముంబై 9 పరుగుల తేడాతో గెలిచింది.
ఈ మ్యాచ్‌లో గేమ్ ఛేంజర్ అయిన మహ్మద్ నబీకి ఒక్క ఓవర్ వేసే అవకాశం కూడా ఇవ్వలేదు హార్దిక్ పాండ్య. దీనిపైనే నబీ అభిమాని తీవ్రంగా మండిపడుతూ పోస్టు చేశాడు. నబీ సైతం ఈ విషయాన్నే హైలెట్ చేస్తూ తన ఇన్‌స్టా స్టోరీలో పోస్ట్ చేశాడు. ఇక బ్యాటింగ్‌లో కేవలం ఒక్క బంతిని మాత్రమే ఎదుర్కొన్న నబీ పరుగులేమీ చేయకుండా రనౌట్ అయ్యాడు.
Virat Kohli : ‘మీ భార్య..’ విరాట్ కోహ్లి మాటలు విని కంగుతిన్న దినేష్ కార్తీక్
