Vaibhav Sooryavanshi : ఇదేం పోలిక‌రా మామ‌.. వైభవ్ సూర్య‌వంశీ మరో ‘అఫ్రిది’ నా..

ఐపీఎల్ 2026లో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ యువ ఓపెన‌ర్‌, 15 ఏళ్ల వైభ‌వ్ సూర్య‌వంశీ (Vaibhav Sooryavanshi) విధ్వంస‌క‌ర ఇన్నింగ్స్‌ల‌తో చెల‌రేగుతున్నాడు.

Mohammad Yousuf Makes Unique Comparison For Vaibhav Sooryavanshi

Vaibhav Sooryavanshi : ఐపీఎల్ 2026లో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ యువ ఓపెన‌ర్‌, 15 ఏళ్ల వైభ‌వ్ సూర్య‌వంశీ విధ్వంస‌క‌ర ఇన్నింగ్స్‌ల‌తో చెల‌రేగుతున్నాడు. అత‌డి ఆట‌కు అంతా ఫిదా అవుతున్నారు. ఇక ఎలిమినేట‌ర్ మ్యాచ్‌లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ పై ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగాడు. కేవ‌లం 29 బంతుల్లో 5 ఫోర్లు, 12 సిక్స‌ర్ల సాయంతో 97 ప‌రుగులు చేశాడు. ఈ క్ర‌మంలో ఓ ఐపీఎల్ సీజ‌న్‌లో అత్య‌ధిక సిక్స‌ర్లు కొట్టిన ప్లేయ‌ర్‌గా వైభ‌వ్ రికార్డుల‌కు ఎక్కాడు. ప్ర‌స్తుతం అత‌డిపై స‌ర్వ‌త్రా ప్ర‌శంస‌ల వ‌ర్షం కురుస్తోంది.

కొంద‌రు మాజీ ఆట‌గాళ్లు, క్రికెట్ విశ్లేష‌కులు అయితే.. వైభ‌వ్‌ను దిగ్గ‌జ ఆట‌గాళ్లు డాన్ బ్రాడ్‌మ‌న్‌, స‌చిన్ టెండూల్క‌ర్ వంటి వారితో పోలుస్తున్నారు. అయితే.. పాకిస్థాన్ దిగ్గజ బ్యాటర్ మహమ్మద్ యూసుఫ్ సోష‌ల్ మీడియాలో వైభ‌వ్‌ సూర్యవంశీని ప్ర‌శంసిస్తూనే మరో పాకిస్థాన్ దిగ్గజం షాహిద్ అఫ్రిదితో పోల్చాడు.

BCCI : మ‌రో రెండు మ్యాచ్‌ల్లో ముగియ‌నున్న సీజ‌న్‌.. కొత్త రూల్స్ తీసుకువ‌చ్చిన బీసీసీఐ

’15 ఏళ్ల క్రికెట్ సంచలనం వైభవ్ సూర్యవంశీ నాకు షాహిద్ అఫ్రిదీని గుర్తుచేస్తున్నాడు. యువకుడు, నిర్భయుడు, దూకుడు స్వభావం కలవాడు, శక్తితో నిండినవాడు. భవిష్యత్తు ఇక్కడే ఉంది.’ అంటూ యూస‌ఫ్ సోష‌ల్ మీడియాలో రాసుకొచ్చాడు.

వైభ‌వ్ సూర్య‌వంశీ లాగానే షాహిద్ అఫ్రిది త‌న కెరీర్ తొలినాళ్ల‌లో గొప్ప ముద్ర వేశాడు. 1996లో అఫ్రిది త‌న తొలి వ‌న్డే ఇన్నింగ్స్‌లో 37 బంతుల్లో సెంచ‌రీ చేశాడు. దాదాపు 18 ఏళ్ల పాటు వ‌న్డేల్లో ఫాస్టెస్ట్ సెంచ‌రీగా ఇది నిలిచింది.

IPL Qualifier 2 GT vs RR: క్వాలిఫ‌య‌ర్ 2 మ్యాచ్‌కు వ‌ర్షం ముప్పు! ర‌ద్దైతే గుజ‌రాత్‌, రాజ‌స్థాన్‌ల‌లో ఫైన‌ల్ చేరేది ఎవ‌రంటే?

కాగా.. యూసుఫ్ పోలికను చూసిన ఇదేం పోలిక మామ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.