Mohammed Shami : చ‌రిత్ర సృష్టించిన ష‌మీ.. ఒకే ఒక్క భార‌తీయుడు.. ద‌రిదాపుల్లో ఎవ‌రూ లేరు

వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో మ‌హ్మ‌ద్ ష‌మీ చ‌రిత్ర సృష్టించాడు. ధ‌ర్మ‌శాల వేదిక‌గా న్యూజిలాండ్‌తో జ‌రుగుతున్న మ్యాచ్‌లో ఐదు వికెట్లు ప‌డ‌గొట్టి స‌త్తా చాటాడు.

Mohammed Shami

Mohammed Shami record : వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో మ‌హ్మ‌ద్ ష‌మీ చ‌రిత్ర సృష్టించాడు. ధ‌ర్మ‌శాల వేదిక‌గా న్యూజిలాండ్‌తో జ‌రుగుతున్న మ్యాచ్‌లో ఐదు వికెట్లు ప‌డ‌గొట్టి స‌త్తా చాటాడు. ఈ క్ర‌మంలో ఓ అరుదైన రికార్డును త‌న ఖాతాలో వేసుకున్నాడు. ప్ర‌పంచ‌క‌ప్‌ల‌లో ఐదు వికెట్ల ప్ర‌ద‌ర్శ‌న ను రెండు సార్లు న‌మోదు చేసిన ఏకైక భార‌త బౌల‌ర్‌గా నిలిచాడు. ష‌మీ కాకుండా మ‌రే ఇత‌ర టీమ్ఇండియా బౌల‌ర్ కూడా ప్ర‌పంచ‌క‌ప్‌ల‌లో రెండు సార్లు ఐదు వికెట్ల ప్ర‌ద‌ర్శ‌న‌ను న‌మోదు చేయ‌లేదు.

కపిల్ దేవ్, వెంకటేష్ ప్రసాద్, రాబిన్ సింగ్, ఆశిష్ నెహ్రా, యువరాజ్ సింగ్ లు త‌లా ఓ సారి ఐదు వికెట్ల ప్ర‌ద‌ర్శ‌న చేశారు. కాగా.. నేటి మ్యాచ్‌తో క‌లిపి మొత్తంగా వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌ల‌లో 12 మ్యాచులు ఆడిన ష‌మీ 36 వికెట్లు ప‌డ‌గొట్టాడు.

భార‌త్ త‌రుపున వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌ల‌లో ఐదు వికెట్ల ప్ర‌ద‌ర్శ‌న‌ను న‌మోదు చేసిన ప్లేయ‌ర్లు..

మహ్మద్ షమీ – 2
కపిల్ దేవ్ -1
వెంకటేష్ ప్రసాద్ – 1
రాబిన్ సింగ్ -1
ఆశిష్ నెహ్రా – 1
యువరాజ్ సింగ్ – 1

ప్రపంచ కప్‌లలో అత్యధిక సార్లు 4 ఫ్ల‌స్ వికెట్లు తీసిన ఆట‌గాళ్లు..

ష‌మీ మ‌రో ఘ‌న‌త‌ను అందుకున్నాడు. వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో అత్య‌ధిక సార్లు 4 ఫ్ల‌స్ వికెట్లు తీసిన ఆట‌గాళ్ల జాబితాలో ఇమ్రాన్ తాహిర్‌తో క‌లిసి రెండో స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో ఆసీస్ పేస‌ర్ మిచెల్ స్టార్క్ అగ్ర‌స్థానంలో ఉన్నాడు. అత‌డు 6 సార్లు 4 కంటే ఎక్కువ వికెట్ల ప్ర‌ద‌ర్శ‌న‌ను చేశాడు. ఆ త‌రువాతి స్థానంలో తాహిర్‌, ష‌మీలు చెరో 5 సార్లు ఈ ఫీట్ సాధించారు. ష‌మీ కాకుండా మ‌రే భార‌త బౌల‌ర్ కూడా ప్ర‌పంచ‌క‌ప్‌ల‌లో రెండు కంటే ఎక్కువ సార్లు 4 కంటే ఎక్కువ వికెట్ల ప్ర‌ద‌ర్శ‌న‌ను న‌మోదు చేయ‌లేదు.
Sehar Shinwari : భార‌త్ పై పాకిస్థాన్‌ న‌టి అక్క‌సు.. టీమ్ఇండియాని ఓడిస్తే మ‌ట‌న్ బిర్యానీ..

ప్రపంచకప్‌లలో భారత్‌ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌల‌ర్లు జాబితా..

జహీర్ ఖాన్ – 44
జవగల్ శ్రీనాథ్ – 44
మహ్మద్ షమీ – 36*
అనిల్ కుంబ్లే – 31
జ‌స్‌ప్రీత్ బుమ్రా – 28*

ODI World Cup 2023 : సెమీ ఫైనల్‌లో ఆడటానికి పాకిస్థాన్ కు నిజంగా అర్హత ఉందా..? : అక్త‌ర్‌