Mohammed Shami : కారు ప్రమాదం నుంచి వ్యక్తిని కాపాడిన క్రికెటర్ మహ్మద్ షమీ
భారత క్రికెటర్ మహ్మద్ షమీ నానిటాల్‌లో ఒక వ్యక్తికి ప్రాణదానం చేశారు. కారు ప్రమాదంలో చిక్కుకున్న ఓ వ్యక్తిని క్రికెటర్ మహ్మద్ షమీ కాపాడిన ఘటన తాజాగా నైనిటాల్ నగరంలో వెలుగుచూసింది.ప్రమాదానికి గురైన వ్యక్తికి సంబంధించిన వీడియోను మహ్మద్ షమీ శనివారం అర్థరాత్రి సోషల్ మీడియాలో షేర్ చేశారు.....
- saleem sk
- Published On : November 26, 2023 / 02:24 PM IST
Mohammed Shami
Mohammed Shami : భారత క్రికెటర్ మహ్మద్ షమీ నానిటాల్‌లో ఒక వ్యక్తికి ప్రాణదానం చేశారు. కారు ప్రమాదంలో చిక్కుకున్న ఓ వ్యక్తిని క్రికెటర్ మహ్మద్ షమీ కాపాడిన ఘటన తాజాగా నైనిటాల్ నగరంలో వెలుగుచూసింది.ప్రమాదానికి గురైన వ్యక్తికి సంబంధించిన వీడియోను మహ్మద్ షమీ శనివారం అర్థరాత్రి సోషల్ మీడియాలో షేర్ చేశారు. తీవ్రమైన రోడ్డు ప్రమాదం జరగకుండా ఉండేందుకు తాను, కొంతమంది వ్యక్తులు లోయలోకి వెళ్లిన కారులో నుంచి వ్యక్తిని సకాలంలో బయటకు తీసినట్లు షమీ పేర్కొన్నారు.
ALSO READ : Jasprit Bumrah : జస్ప్రీత్ బుమ్రా,సంజన దంపతులకు పండంటి మగబిడ్డ…సోషల్ మీడియాలో పోస్ట్
నైనిటాల్ నగరంలో షమీ పర్యటిస్తుండగా ఈ ఘటన జరిగింది. ఓ వ్యక్తి కారు ప్రమాదవశాత్తూ కొండపై నుంచి కిదకు పడిపోయింది. ఆ మార్గంలో కారులో వెళుతున్న షమీ స్పందించి ప్రమాదానికి గురైన కారులోనుంచి వ్యక్తిని కాపాడారు. తన కారు ఎదురుగా వస్తూ ప్రమాదానికి గురవడంతో అతన్ని కారులో నుంచి సురక్షితంగా బయటకు తీశామని షమీ పేర్కొన్నారు. సామాన్య కుటుంబం నుంచి వచ్చిన తనకు బైక్ లు, కార్లు, ట్రాక్టర్లు, బస్సులు, ట్రక్కులు నడపటం అంటే ఎంతో ఇష్టమని షమీ చెప్పారు.
నాకు కారులో ప్రయాణించడం, చేపలు పట్టడం అంటే ఎంతో ఇష్టమని ఆయన పేర్కొన్నారు. బైక్ లు నడపటం ఇష్టం ఉన్నా గాయాలవుతాయని మానేశానని ఆయన చెప్పారు. తన అమ్మను కలవడానికి గ్రామానికి బైక్ పై వెళ్లే వాడినని ఆయన తెలిపారు. తన పాఠశాల క్లాస్ మేట్ ఇంట్లో ఉన్న ట్రక్కును నడిపానని షమీ వివరించారు. తాను ట్రాక్టరును చెరువులో నడిపినందుకు తన తండ్రి తిట్టాడని తన పాత సంఘటనను షమీ గుర్తు చేసుకున్నారు.
