Jasprit Bumrah : జస్ప్రీత్ బుమ్రా,సంజన దంపతులకు పండంటి మగబిడ్డ…సోషల్ మీడియాలో పోస్ట్

టీం ఇండియా ఫేసర్ జస్ర్పీత్ బుమ్రా,సంజన దంపతులకు పండంటి మగబిడ్డ జన్మించారు. తన కుమారుడి చిత్రాన్ని బుమ్రా,సంజన గణేశన్ దంపతులు సోషల్ మీడియాలో పంచుకున్నారు.....

Jasprit Bumrah : జస్ప్రీత్ బుమ్రా,సంజన దంపతులకు పండంటి మగబిడ్డ…సోషల్ మీడియాలో పోస్ట్

Jasprit Bumrah

Jasprit Bumrah : టీం ఇండియా ఫేసర్ జస్ప్రీత్ బుమ్రా,సంజన దంపతులకు పండంటి మగబిడ్డ జన్మించారు. తన కుమారుడి చిత్రాన్ని బుమ్రా,సంజన గణేశన్ దంపతులు సోషల్ మీడియాలో పంచుకున్నారు. ‘‘మై లిటిల్ సన్‌షైన్’’ అని స్టార్ ఇండియా పేసర్ క్యాప్షన్‌లో రాశారు. బుమ్రా శిశువు ముఖాన్ని దాచడానికి చిత్రంపై సూర్యుడి ఎమోజీని ఉపయోగించారు. పండంటి శిశువును తన చేతుల్లోకి తీసుకున్న బుమ్రా చిరునవ్వులు చిందించారు.

ALSO READ : Telangana Assembly Election 2023 : ఆస్తులు, కేసుల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థులే అధికం…ఏడీఆర్ సంచలన నివేదిక వెల్లడి

తనకు మగబిడ్డ అంటే ఇష్టమని బుమ్రా భార్య స్పోర్ట్స్ ప్రెజంటర్ సంజనా గణేశన్ సోషల్ మీడియాలో హార్ట్ ఎమోజీతో పోస్టు పెట్టారు. ‘‘మా చిన్న కుటుంబం పెరిగింది, మా చిన్న పిల్లవాడు అంగద్ జస్ప్రీత్ బుమ్రాను ప్రపంచానికి స్వాగతించాం, మా జీవితంలో ఇది కొత్త అధ్యాయం’’అని బుమ్రా పేర్కొన్నారు.ఈ ఏడాది నవంబర్ 19న అహ్మదాబాద్‌లో జరిగిన క్రికెట్ వరల్డ్ కప్ 2023 ఫైనల్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయిన జట్టులో బుమ్రా ఉన్నారు.

Jasprit Bumrah

Jasprit Bumrah

ALSO READ : Alert : చైనాలో హెచ్9ఎన్2 మహమ్మారి వ్యాప్తి…కేరళలో ఆరోగ్యశాఖ అధికారుల అలర్ట్

ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ నుంచి బుమ్రాకు కూడా విశ్రాంతి ఇచ్చారు. అక్టోబర్ 19వతేదీన బంగ్లాదేశ్‌తో జరిగిన క్రికెట్ వరల్డ్ కప్ 2023 మ్యాచ్‌లో చీలమండ గాయం కారణంగా రెగ్యులర్ టీ20 కెప్టెన్ హార్దిక్ పాండ్యా జట్టుకు దూరంగా ఉండటంతో సూర్యకుమార్ యాదవ్‌ను ఈ సిరీస్‌కు కెప్టెన్‌గా నియమించారు. బుమ్రా పోస్టుకు నెటిజన్ల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.