Gujarat Titans : ఐపీఎల్ వేలానికి ముందు గుజ‌రాత్ టైటాన్స్‌కు మ‌రో షాక్‌..? అదే జ‌రిగితే..?

GT : ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2024 సీజ‌న్‌కు ముందు గుజ‌రాత్ టైటాన్స్ జ‌ట్టుకు మ‌రో భారీ షాక్ త‌గిలే అవ‌కాశం ఉంది.

Gujarat Titans

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2024 సీజ‌న్‌కు ముందు గుజ‌రాత్ టైటాన్స్ జ‌ట్టుకు మ‌రో భారీ షాక్ త‌గిలే అవ‌కాశం ఉంది. రెండు సీజ‌న్ల పాటు ఆ జ‌ట్టుకు కెప్టెన్‌గా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించిన హార్దిక్ పాండ్య ముంబై ఇండియ‌న్స్‌కు ట్రేడ్ అయిన సంగ‌తి తెలిసిందే. ఇక ఇప్పుడు వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో లీడింగ్ వికెట్ టేక‌ర్‌, గుజ‌రాత్ టైటాన్స్ స్టార్ పేస‌ర్ అయిన మ‌హ్మ‌ద్ ష‌మీ ఫ్రాంఛైజీ మారే అవ‌కాశాలు ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఈ విష‌య‌మై ఇప్ప‌టికే ఓ ఫ్రాంచైజీ ష‌మీని సంప్ర‌దించింద‌ట‌. ఈ విష‌యాన్ని గుజ‌రాత్ టైటాన్స్ చీఫ్ ఆప‌రేటింగ్ ఆఫీస‌ర్ క‌ల్న‌ల్ అర్వింద‌ర్ సింగ్ వెల్ల‌డించారు. ఓ ఆంగ్ల మీడియాతో మాట్లాడుతూ ఈ విష‌యాన్ని తెలిపాడు.

ప్ర‌తీ ఫ్రాంచైజీకి అగ్ర‌శేణి ఆట‌గాళ్ల‌ను ఎంచుకునే హ‌క్కు ఉంటుంద‌న్నారు. ఒక‌వేళ ఏదైన ఐపీఎల్ ప్రాంచైజీ ట్రేడింగ్ కోసం ప్లేయ‌ర్‌ను నేరుగా సంప్ర‌దించ‌డం మాత్రం త‌ప్పు అని చెప్పుకొచ్చారు. దీని ప‌ట్ల గుజ‌రాత్ టైటాన్స్ జ‌ట్టు సంతోషంగా లేదన్నారు. ఆట‌గాళ్ల ట్రేడింగ్ కోసం భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) కొన్ని నిబంధ‌న‌లు రూపొందించిందని, ఏ ప్లేయ‌ర్‌ను అయిన ఓ ఫ్రాంచైజీ కావాల‌నుకుంటే ఈ విష‌యాన్ని స‌ద‌రు ప్రాంచైజీ బీసీసీఐ దృష్టికి తీసుకువెళ్లాల్సి ఉంటుంద‌న్నారు.

ICC Player of the Month : ప్లేయ‌ర్ ఆఫ్ ది మంత్ అవార్డు.. రేసులో ఒకే ఒక్క భార‌తీయుడు

Mohammed Shami

అప్పుడు బీసీసీఐ ఆ ఆట‌గాడు ఏ జ‌ట్టులో ఉన్నాడో ఆ ఫ్రాంచైజీ వివ‌రాలు తెలియ‌జేస్తుంది. అనంత‌రం ఆ ఫ్రాంచైజీ ఏ నిర్ణ‌యం తీసుకుంటుంది అన్న దానిపైనే ఆట‌గాడి ట్రేడింగ్ ఆధార‌ప‌డి ఉంటుంద‌న్నారు. కాగా..’ ఓ ఐపీఎల్ ఫ్రాంచైజీ నేరుగా మా కోచింగ్ బృందాన్ని సంప్ర‌దించింది. ఇది చాలా త‌ప్పు. బ‌దిలీ గురించి అయితే ముందే మాతో మాట్లాడి ఉండే వారు. నిజానికి ఈ విష‌యం మేము త‌రువాత తెలుసుకున్నాం.’ అని అర్వింద‌ర్ సింగ్ చెప్పారు.

అయితే ఆ ఫ్రాంచైజీ ఏదనే విషయాన్ని అర్వింద‌ర్ వెల్ల‌డించ‌లేదు. మ‌రీ ష‌మీ ప్రాంచైజీ మార‌తాడా లేదా అన్న‌ది మ‌రో నాలుగు ఐదు రోజుల్లో తేలిపోనుంది. ఎందుకంటే ఆట‌గాళ్ల ట్రేడింగ్ కోసం డిసెంబ‌ర్ 12 వ‌ర‌కు బీసీసీఐ అవ‌కాశం ఇచ్చింది.

Sreesanth vs Gambhir : శ్రీశాంత్‌తో గంభీర్‌ గొడ‌వ‌.. స్పందించిన భువ‌నేశ్వ‌రి.. నిజం చెప్పాలంటే..?

ట్రెండింగ్ వార్తలు