Mohsin Naqvi to get gold medal from Pakistan for running away with Asia Cup trophy Report
Mohsin Naqvi : ఆసియాకప్ 2025 విజేతగా భారత్ నిలిచింది. ఫైనల్‌లో పాకిస్తాన్‌ను చిత్తు చేసిన సంగతి తెలిసిందే. మ్యాచ్ ముగిసిన తరువాత ట్రోఫీ విషయంలో వివాదం చెలరేగింది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చీఫ్, ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు, ఆ దేశ అంతర్గత మంత్రి కూడా అయిన మొహ్సిన్ నఖ్వీ (Mohsin Naqvi) నుంచి ట్రోఫీ, మెడల్స్ తీసుకునేందుకు భారత ఆటగాళ్లు నిరాకరించారు. దీంతో ఆగ్రహించిన నఖ్వీ పెద్ద డ్రామానే చేశాడు. అతడి పట్టుదల కారణంగా ప్రెజెంటేషన్ వేడుక గంటన్నర ఆలస్యంగా ప్రారంభమైంది.
అంతేకాదండోయ్.. ట్రోఫీని, గెలిచిన జట్టుకు ఇచ్చే మెడల్స్‌ను ఇవ్వకుండా దొంగతనంగా తన హోటల్ రూమ్‌కు తీసుకుని వెళ్లిపోయాడు. రాత్రంతా అతడి వద్దే ఉంచుకున్నాడు. పైగా టీమ్ఇండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ దుబాయ్‌లోని ఏసీసీ కార్యాలయానికి వస్తే తానే ట్రోఫీని ఇస్తానని పట్టుబట్టాడు. అతడు వ్యవహరించిన తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఏసీసీ సమావేశంలో పీసీబీ చైర్మన్ వ్యవహరించిన తీరుపై బీసీసీఐ ఆగ్రహం వ్యక్తం చేసింది. ట్రోఫీని భారత జట్టుకు అప్పగించకపోవడంపై మండిపడింది. అలా చేసేందుకు ఆయనకు ఎలాంటి హక్కు లేదంది. బీసీసీఐ దెబ్బకు దిగరాక తప్పలేదు. అందరికి క్షమాపణలు చెప్పాడు.
IND vs WI : మూడో రోజు ప్రారంభమైన ఆట.. ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసిన భారత్..
ఇదిలా ఉంటే.. నఖ్వీ చేసిన పనికి పాక్‌లో సన్మానం చేస్తున్నారట. ప్రముఖ పత్రిక ది నేషన్‌లో వచ్చిన నివేదిక ప్రకారం.. ఆసియాకప్ 2025లో నఖ్వీ కఠిన వైఖరికి గాను ఆయనకు మెడల్ అందజేస్తున్నట్లు పేర్కొంది. సింధ్, కరాచీ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ల అధ్యక్షుడు అడ్వకేట్ గులాం అబ్బాస్ జమాల్.. నఖ్వీని షహీద్ జుల్ఫికర్ అలీ భుట్టో ఎక్సలెన్స్ గోల్డ్ మెడల్‌తో సత్కరించనున్నట్లు వెల్లడించింది.
ఆసియాకప్‌లో నఖ్వీ సూత్రబద్దమైన వైఖరిని అవలంభించడం ద్వారా పాక్ గౌరవాన్ని పెంచారని అందుకనే మెడల్‌తో సత్కరించనున్నట్లు గులాం అబ్బాస్ జమాల్ చెప్పినట్లు పేర్కొంది.