Viral Video
ప్యారిస్‌లో ఒలింపిక్ ఆక్వాటిక్స్ సెంటర్ ప్రారంభోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో సరదా సంఘటన చోటుచేసుకుంది. ఫ్రెంచ్ డైవర్ అలెక్సిస్ జాండార్డ్ (26) డైవింగ్ బోర్డుపై నుంచి జారిపడ్డాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయన చూస్తుండగానే అలెక్సిస్ జాండార్డ్ డైవింగ్ బోర్డుపై నుంచి జారిపడ్డాడు. మొత్తం ముగ్గురు డైవర్లు స్విమ్మింగ్ పూల్లోకి డైవ్ చేశారు. అందులో చివరన నిలబడిన అలెక్సిస్ డైవింగ్ బోర్డుపై ఎగరగానే జారిపోవడం గమనార్హం.
అనంతరం అలెక్సిస్ మీడియాతో మాట్లాడుతూ.. తాను జారిపడినప్పటికీ తన వెన్నెముక బాగానే ఉందని చెప్పాడు. కానీ, తన ఇగో మాత్రం హర్ట్ అయిందని అన్నాడు. ప్యారిస్ లో ఈ ఏడాది జులై 26 నుంచి ఆగస్టు 11 వరకు ఒలింపిక్ గేమ్స్ జరగనున్నాయి. అందుకు ప్యారిస్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుంటోంది.
Also Read: ఉప్పల్‌లో ఆసక్తికర పోరు.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై భారీగా అంచనాలు