Virat Kohli : చెత్త రికార్డులో రన్ మెషీన్.. కోహ్లీ గోల్డెన్ డకౌట్ల ట్రాజెడీ.. టాప్ ప్లేస్ ఎవరిదంటే?
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ (Virat Kohli) ఆదివారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గోల్డెన్ డకౌట్ అయ్యాడు.
- Thota Vamshi Kumar
- Updated on- May 11, 2026 / 09:11 AM IST
Most golden ducks in IPL history Virat Kohli in 3rd place (pic credit@ipl)
- ముంబైతో మ్యాచ్‌లో కోహ్లీ గోల్డెన్ డక్
- ఐపీఎల్ చరిత్రలో ఇలా ఔట్ అవ్వడం కోహ్లీకి ఇది 8వ సారి
Virat Kohli : రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ ఆదివారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గోల్డెన్ డకౌట్ అయ్యాడు. ఆడిన తొలి బంతికే అతడు పెవిలియన్‌కు చేరుకున్నాడు. దీపక్ చాహర్ బౌలింగ్‌లో రాజ్ బవా క్యాచ్ అందుకోవడంతో ఔట్ అయ్యాడు. దీంతో కోహ్లీ నిరాశగా పెవిలియన్ బాట పట్టాడు.
ఐపీఎల్ చరిత్రలో కోహ్లీకి ఇది 12 డకౌట్ కాగా.. 8వ గోల్డెన్ డకౌట్ కావడం గమనార్హం. ఇక ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సార్లు గోల్డెన్ డకౌట్ అయిన జాబితాలో మూడో స్థానంలో నిలిచాడు.
ఎవరూ కోరుకుని ఈ జాబితాలో రషీద్ ఖాన్ ఉన్నాడు. అతడు 12 సార్లు గోల్డెన్ డకౌట్‌గా పెవిలియన్‌కు చేరుకున్నాడు. ఆ తరువాత గ్లెన్ మాక్స్‌వెల్ ఉన్నాడు. అతడు 10 సార్లు గోల్డెన్ డకౌట్ అయ్యాడు.
ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సార్లు గోల్డెన్ డకౌట్లు అయిన బ్యాటర్లు వీరే..
* రషీద్ ఖాన్ – 12 సార్లు
* గ్లెన్ మాక్స్‌వెల్ – 10 సార్లు
* విరాట్ కోహ్లీ – 8 సార్లు
* ఇషాన్ కిషన్ – 8 సార్లు
* సునీల్ నరైన్ – 8 సార్లు
19 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో కోహ్లీ వరుసగా రెండు మ్యాచ్‌ల్లో డకౌట్లు కావడం ఇది రెండో సారి మాత్రమే. లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన గత మ్యాచ్‌లోనూ కోహ్లీ రెండు బంతులకు డకౌట్ అయ్యాడు. అంతకముందు 2022 ఐపీఎల్ సీజన్‌లో లక్నో, సన్ రైజర్స్ పై వరుస మ్యాచ్‌ల్లో కోహ్లీ డకౌట్లు అయ్యాడు.
