MS Dhoni : ఆ జాబితాలో ధోని చోటు గల్లంతు.. ఇక మిగిలింది ముగ్గురే..

మొన్న‌టి వ‌ర‌కు అరుదైన జాబితాలో ఎంఎస్ ధోని (MS Dhoni ) కూడా ఉండేవాడు.

ms dhoni missed Only 3 cricketers are there in unique feat in ipl history

  • ఇక పై ఆ అరుదైన జాబితాలో ధోని ఉండ‌దు
  • ప్ర‌స్తుతం కేవ‌లం ముగ్గురు క్రికెట‌ర్లు మాత్ర‌మే
  • రోహిత్‌, కోహ్లీ, మ‌నీశ్ పాండే

MS Dhoni : 2008లో ఐపీఎల్ ప్రారంభ‌మైంది. ప్ర‌స్తుతం 19వ సీజ‌న్ జ‌రుగుతోంది. ఎంతో మంది ఆట‌గాళ్లు ఈ మెగాటోర్నీ ద్వారా వెలుగులోకి వ‌చ్చి అంత‌ర్జాతీయ క్రికెట్‌లో దిగ్గ‌జ క్రికెట‌ర్లుగా ఎదిగారు కూడా. ఎంతో మంది రిటైర్ అయ్యారు కూడా. అయితే.. ఇప్ప‌టి వ‌ర‌కు కేవ‌లం కొంద‌రు క్రికెట‌ర్లు మాత్ర‌మే ఐపీఎల్ అరంగ్రేటం నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ఆడుతున్నారు.

మొన్న‌టి వ‌ర‌కు ఈ అరుదైన జాబితాలో ఎంఎస్ ధోని కూడా ఉండేవాడు. అయితే.. ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో ధోని ఒక్క మ్యాచ్ కూడా ఆడ‌లేదు. దీంతో ఈ జాబితా నుంచి అత‌డి పేరు పోయిన‌ట్లే. ఈ సీజ‌న్‌లో సీఎస్‌కే లీగ్ ద‌శ‌లో 14 మ్యాచ్‌లు ఆడేసింది. ప్లేఆఫ్స్‌కు చేరుకోలేదు. దీంతో ధోని ఆడే అవ‌కాశం లేదు.

MS Dhoni Future : ధోని రిటైర్‌మెంట్ పై సీఎస్‌కే బౌలింగ్ కోచ్ కుండ‌బ‌ద్ద‌లు కొట్టాడు.. చూడండి జ‌ట్టు ప్ర‌యోజ‌నాలే..

ఆ ముగ్గురు..

ఐపీఎల్ అరంగ్రేటం నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ఓ ముగ్గురు ఆట‌గాళ్లు మాత్రం ప్ర‌తి సీజ‌న్‌లో క‌నీసం ఒక్క మ్యాచ్ అయిన ఆడారు. వారు మ‌రెవ‌రో కాదు విరాట్ కోహ్లీ, రోహిత్ శ‌ర్మ‌, మ‌నీశ్‌ పాండే. వీరిలో రోహిత్ , మ‌నీశ్ లు క‌నీసం రెండు ప్రాంఛైజీల త‌రుపున ఆడారు. అయితే.. కోహ్లీ మాత్రం ఐపీఎల్ ఆరంభం నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు త‌రుపున‌నే ఆడుతున్నాడు.