×
Ad

MS Dhoni : ప్రాక్టీస్ సెష‌న్‌లో త‌ప్పు చేసిన స‌ర్ఫ‌రాజ్ ఖాన్‌.. ధోని రియాక్ష‌న్ వైర‌ల్‌.. త‌న రెండు చేతుల‌తో..

ప్రాక్టీస్ సెష‌న్‌లో స‌ర్ఫ‌రాజ్ ఖాన్ త‌ప్పుచేయ‌గా ఎంఎస్ ధోని (MS Dhoni ) ఇచ్చిన రియాక్ష‌న్ వైర‌ల్ అవుతోంది.

MS Dhoni Reaction after Sarfaraz Khan Makes Error During CSK Practice Session

  • ఐపీఎల్ 2026 సీజ‌న్ కోసం ప్రాక్టీస్ మొద‌లెట్టిన సీఎస్‌కే
  • స‌ర‌దాగా ఫుట్‌బాల్ ఆడిన ప్లేయ‌ర్లు
  • పొర‌బాటున త‌ప్పు చేసిన స‌ర్ఫారాజ్ ఖాన్‌

MS Dhoni : ఈ నెలాఖ‌రులో ఐపీఎల్ 2026 సీజ‌న్ ప్రారంభం కానుంది. ఈ నేప‌థ్యంలో అప్పుడే చెన్నై సూప‌ర్ కింగ్స్ (CSK) జ‌ట్టు ఈ సీజ‌న్ కోసం త‌మ స‌న్నాహాకాల‌ను మొద‌లు పెట్టింది. సీనియ‌ర్ ఆట‌గాడు ఎంఎస్ ధోని (MS Dhoni), కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌ల‌తో పాటు దాదాపుగా అంద‌రు ఆట‌గాళ్లు చెన్నై చేరుకుని ప్రాక్టీస్‌లో నిమ‌గ్నం అయ్యారు.

కాగా.. సీఎస్‌కే ప్రాక్టీస్ సెష‌ల్ కు సంబంధించిన ఓ వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. వీడియోలో ధోనితో పాటు మ‌రికొంద‌రు ఆట‌గాళ్లు ఫుట్‌బాల్‌తో ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈ సీజ‌న్‌లోనే సీఎస్‌కే జ‌ట్టులోకి వ‌చ్చిన సర్ఫ‌రాజ్ ఖాన్ పొర‌బాటున త‌న చేతిలో బంతిని ప‌ట్టుకున్నాడు.

IND vs ENG : సెమీస్ మ్యాచ్‌కు ముందు భార‌త్‌కు ఇంగ్లాండ్ ఆల్‌రౌండ‌ర్ వార్నింగ్‌.. కాస్కోండి.. గురువారం వాంఖ‌డేలో మొత్తం నిశ్శ‌బ్ద‌మే

దీన్ని గ‌మ‌నించిన ధోని వ్యంగంగా నెమ్మ‌దిగా చ‌ప్ప‌ట్లు కొట్టాడు. స‌ర్ఫ‌రాజ్ చేసిన త‌ప్పును చూసి అక్క‌డ ఉన్న వారు న‌వ్వుకున్నారు. దీనిపై నెటిజ‌న్లు త‌మ‌దైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.

ఐపీఎల్ 2024, 2025 వేలాల్లో స‌ర్ఫ‌రాజ్ అమ్ముడుపోలేదు. ఐపీఎల్ 2026 మినీ వేలంలో అత‌డిని రూ.75 ల‌క్ష‌ల‌కు చెన్నై సూప‌ర్ కింగ్స్ తీసుకుంది.

T20 World Cup 2026 : భార‌త్, ఇంగ్లాండ్ సెమీస్ మ్యాచ్‌కు అంపైర్లు వీరే..

చెన్నైలోని తమ హై-పెర్ఫార్మెన్స్ సెంటర్‌లో శిబిరాన్ని ప్రారంభించింది సీఎస్‌కే. ఆయుష్ మాత్రే, ముఖేష్ చౌదరి, రాహుల్ చాహర్, ఉర్విల్ పటేల్, రామకృష్ణ ఘోష్, సర్ఫరాజ్ ఖాన్ వంటి భార‌త ఆట‌గాళ్లు ఈ శిబిరంలో పాల్గొంటున్నారు. జాతీయ జ‌ట్టులో ఆడుతున్న సంజూ శాంస‌న్‌, శివ‌మ్ దూబె వంటి ఆట‌గాళ్లు టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2026 ముగిసిన త‌రువాత సీఎస్‌కే జ‌ట్టులో చేర‌నున్నారు.