MS Dhoni Sings 'Bole Jo Koyal' In Viral Advertisement
టీమ్ఇండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ప్లేయర్ మహేంద్ర సింగ్ ధోనికి క్రికెట్ పై ఉన్న పరిజ్ఞానం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక మహికి పాతకాలపు బాలీవుడ్ పాటలు అంటే చాలా ఇష్టం అన్న సంగతి తెలిసిందే. తాజాగా ధోని గాన నైపుణ్యాన్ని ప్రదర్శించాడు. ఓ వాణిజ్య ప్రకటన కోసం గళం విప్పాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఓ ఈ-సైకిల్ ప్రకటనలో ధోని కనిపించాడు. ఎలక్ట్రిక్ సైకిల్ పై పల్లెటూరి వాతావరణంలో ధోని ప్రయాణిస్తూ.. అప్రయత్నంగా ‘బోలే జో కోయల్’ అనే పాటను పాడాడు. ఎక్కడా కూడా చిన్న తప్పు లేకుండా పాడాడు. ఈ యాడ్ ద్వారా ధోని తనలోని బహుముఖ ప్రజ్ఞను ప్రదర్శించి అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తాడు.
కాగా..ధోని అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ను ఆగస్టు 15న 2020 ప్రకటించనప్పుడు కూడా అదే పాటను నేపథ్య స్కోరుగా ఉపయోగించారు.
Rishabh Pant : ఒకే ఓవర్లో రిషబ్ పంత్ 4,6,6,4,4,4 .. షారుఖ్ ఖాన్ రియాక్షన్ వైరల్
ఇదిలా ఉంటే.. ప్రస్తుతం ధోని ఐపీఎల్లో బిజీగా ఉన్నాడు. ఈ సీజన్‌కు ముందు చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్సీ బాధ్యతలను వదిలివేశాడు. రుతురాజ్ గైక్వాడ్ నాయకత్వంలో ధోని ఆడుతున్నాడు. ఇప్పటి వరకు చెన్నై మూడు మ్యాచులు ఆడింది. రెండు మ్యాచుల్లో విజయాలు సాధించి ఓ మ్యాచ్ లో ఓడింది.
నాలుగు పాయింట్లతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతోంది. కాగా.. ధోనికి ఇదే చివరి సీజన్ అంటూ ప్రచారం జరుగుతోంది. అయితే.. దీనిపై ఇంతవరకు ధోని స్పందించలేదు.
2024 is full of surprises 🫡 MS Dhoni is singing Bole jo Koyal 🔥
Tag a friend who can easily afford the Thala bicycle.
➤ https://t.co/SlVL77mupipic.twitter.com/Py6YlXDQrh
— DealzTrendz (@dealztrendz) April 5, 2024
Rohit Sharma : రోహిత్ ముంబైని నడిపిస్తాడు.. అయితే.. : మాజీ క్రికెటర్ ఆసక్తికర వ్యాఖ్యలు