MS Dhoni : గుర్రంతో ధోని పరుగులు, వీడియో వైరల్

ఓ గుర్రంతో గడపుతున్న ధోనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇటీవలే ఓ చిన్న గుర్రానికి మసాజ్, స్నానం చేయించిన ధోని..ఇప్పుడు మరో చిన్న గుర్రంతో ఆటలాడడం కనిపించింది. దానితో పరుగులు తీశారు.

MS Dhoni : టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని..ఫామ్ హౌజ్ లో రిలాక్స్ అవుతున్నారు. కాస్త తీరిక టైం దొరికితే చాలు..కుటుంబసభ్యులతో ఎంజాయ్ చేయడానికి ఆసక్తి చూపుతుంటారు. సరద సరదగా గడుపుతుంటారు. అంతేగాకుండా..ఇతనికి జంతువులంటే మహా ప్రేమ. ఫామ్ హౌజ్ లు పలు జంతువులున్నాయి. మూగజీవాలతో గడిపేందుకు ఉత్సాహం చూపుతుంటారు ధోని. తాజాగా..ఓ గుర్రంతో గడపుతున్న ధోనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇటీవలే ఓ చిన్న గుర్రానికి మసాజ్, స్నానం చేయించిన ధోని..ఇప్పుడు మరో చిన్న గుర్రంతో ఆటలాడడం కనిపించింది. దానితో పరుగులు తీశారు. దీనికి సంబంధించిన వీడియోను ఆయన సతీమణి ఇన్ స్ట్రాగ్రామ్ లో పోస్టు చేశారు. ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. పలు కామెంట్స్ చేస్తూ..లైక్స్ కొట్టేస్తున్నారు.

కరోనా వైరస్ కారణంగా..ఐపీఎల్ 14వ సీజన్ అర్ధాంతరంగా నిలిచిపోయిన సంగతి తెలిసిందే. చెన్నై సూపర్ కింగ్స్ కి సారథ్యం వహిస్తున్నారు ధోని. అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన ధోని..యూఏఈలో ఐపీఎల్ 13వ సీజన్ లో ఆడారు. ఈ సీజన్ లో చెన్నై ఏడు మ్యాచ్ ల్లో ఐదు మ్యాచ్ లు విజయం సాధించి..పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది.

Read More : Andhra Pradesh: కరోనా..24 గంటల్లో 6 వేల 770 కేసులు

ట్రెండింగ్ వార్తలు