డ్రెస్సింగ్ రూంలో..: మూడో టెస్టు గెలవడంలో ధోనీ పాత్ర

రాంచీ వేదికగా జరిగిన మూడో టెస్టులో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ పాత్ర కీలకమైందట. చెన్నై సూపర్ కింగ్స్ తో పాటు ధోనీ అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఈ మాటను నొక్కి చెబుతున్నారు. ధోనీ ఉంటే చాలు జట్టు గెలుస్తుందనే మాట మరోసారి నిజమైందంటూ విశ్వసిస్తున్నారు. సొంతగడ్డపై జరుగుతున్న మ్యాచ్ కు ముంబైలో ఉన్న ధోనీ ఆ రోజు ఉదయమే వచ్చి స్టేడియంలో మెరిశాడు. 

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కెప్టెన్..  497పరుగుల వద్ద డిక్లేర్ చేసి సఫారీలను చిత్తు చేశాడు. ఇక్కడ ధోనీ మ్యాచ్ చూడడానికి మాత్రమే కాదు. డ్రెస్సింగ్ రూమ్ కు వెళ్లి విలువైన సలహాలు సూచనలు అందించాడట. ఇది కెమెరా వెనుక జరిగింది కాదు. ఆ ఫొటోలను అధికారికంగానే విడుదల చేశారు. 

మూడో టెస్టుకు ముందే టీమిండియా 2-0తేడాతో ఆధిక్యంలో ఉన్నప్పటికీ మూడో టెస్టులో ఏకపక్షంగా గెలిచేసింది. ప్రత్యర్థుల నుంచి కనీస పోటీ కూడా లేకుండా ధాటిగా ఆడి సిరీస్ ను వైట్ వాష్ చేసింది. స్టేడియం స్వరూపం, దాని నేపథ్యం మొత్తం తెలిసిన మహేంద్ర సింగ్ ధోనీ సూచనలతోనే జట్టు ఇంత సులువుగా గెలిచిందని ధోనీ అభిమానులు చెప్పుకొస్తున్నారు. 

ఈ దెబ్బతో విరాట్ కోహ్లీ భారత పర్యటనలో భాగంగా మూడు టీ20లు మూడు టెస్టులు ఆడేందుకు వచ్చిన సఫారీలకు చుక్కలు చూపించారు భారత ఆటగాళ్లు. వర్షం కారణంగా ఒక టీ20 రద్దు కాగా 1-1సమంగా సిరీస్ ను పూర్తి చేసుకుంది. ఆ తర్వాత టెస్టు ఫార్మాట్ లో భాగంగా ఆడిన మూడో మ్యాచ్‌లోనూ భారత్ ఘున విజయం సాధించింది.