Mumbai Indians : ముంబై ఇండియ‌న్స్‌ది మామూలు అదృష్టం కాద‌య్యా.. స‌న్‌రైజ‌ర్స్ పై ఓట‌మి.. అయినా గానీ ప్లేఆఫ్స్‌కు వెళ్లొచ్చు..

ఐపీఎల్ 2026లో ముంబై ఇండియ‌న్స్ (Mumbai Indians) ప‌రాజ‌యాల పరంప‌ర కొన‌సాగుతూనే ఉంది.

Mumbai Indians Still chance to qualify for IPL 2026 playoffs after defeat SRH (pic credit@ipl)

  • స‌న్‌రైజ‌ర్స్ పై ఓట‌మి
  • ఈ సీజ‌న్‌లో ముంబైకి ఇది ఆరో ప‌రాజ‌యం
  • అయినా గానీ ప్లేఆఫ్‌కు చేరుకునే ఛాన్ ఉంది

Mumbai Indians : ఐపీఎల్ 2026లో ముంబై ఇండియ‌న్స్ ప‌రాజ‌యాల పరంప‌ర కొన‌సాగుతూనే ఉంది. బుధ‌వారం వాంఖ‌డే వేదిక‌గా స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ఓట‌మిని చ‌విచూసింది. ఈ సీజ‌న్‌లో 8 మ్యాచ్‌ల్లో ముంబైకి ఇది ఆరో ప‌రాజ‌యం.

ర్యాన్ రికెల్టన్ (123; 55 బంతుల్లో 10 ఫోర్లు, 8 సిక్స‌ర్లు) శ‌త‌క్కొట్ట‌డంతో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియ‌న్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల న‌ష్టానికి 243 ప‌రుగులు చేసింది. విల్ జాక్స్ (46; 22 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స‌ర్లు), కెప్టెన్ హార్దిక్ పాండ్యా (31; 15 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స‌ర్లు) వేగంగా ఆడారు. స‌న్‌రైజ‌ర్స్ బౌల‌ర్ల‌లో ప్రఫుల్ హింజ్ రెండు వికెట్లు తీశాడు. మ‌లింగ‌, సాకిబ్ హుస్సేన్, నితీశ్ కుమార్ రెడ్డి లు త‌లా ఓ వికెట్ ప‌డ‌గొట్టారు.

PBKS vs RR : అర్ష్‌దీప్ సింగ్ ఎంత ప‌ని చేశావ‌య్యా.. పాపం బుడ్డోడు.. చారిత్రాత్మ‌క ‘సెంచ‌రీ’ రికార్డు జ‌స్ట్ మిస్‌..

అనంత‌రం ట్రావిస్ హెడ్ (76; 30 బంతుల్లో 4 ఫోర్లు, 8 సిక్స‌ర్లు) హెన్రిచ్ క్లాసెన్ (65 నాటౌట్; 30 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్స‌ర్లు) మెరుపు హాఫ్ సెంచ‌రీల‌తో చెల‌రేగ‌డంతో 244 ప‌రుగుల ల‌క్ష్యాన్ని స‌న్‌రైజ‌ర్స్ 18.4 ఓవ‌ర్ల‌లో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. అభిషేక్ శ‌ర్మ (45; 24 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స‌ర్లు), స‌లీల్ అరోరా (30; 10 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స‌ర్లు) వేగంగా ఆడారు. ముంబై బౌల‌ర్ల‌లో ఘజన్‌ఫర్ రెండు వికెట్లు తీశాడు. ట్రెంట్ బౌల్ట్, హార్దిక్ పాండ్యా ఓ వికెట్ ప‌డ‌గొట్టాడు.

ప్లే ఆఫ్‌కు ఎలా అర్హ‌త సాధించ‌గ‌ల‌దు?

ఇప్ప‌టి వ‌ర‌కు ముంబై ఇండియ‌న్స్ ఈ సీజ‌న్‌లో 8 మ్యాచ్‌లు ఆడింది. రెండు మ్యాచ్‌ల్లోనే విజ‌యం సాధించింది. మ‌రో ఆరు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఆ జ‌ట్టు ఖాతాలో 4 పాయింట్లు ఉండ‌గా నెట్‌ర‌న్‌రేటు -0.784గా ఉంది. ప్ర‌స్తుతం పాయింట్ల ప‌ట్టిక‌లో తొమ్మిదో స్థానంలో ఉంది.

Vaibhav Sooryavanshi : చ‌రిత్ర సృష్టించిన వైభ‌వ్ సూర్య‌వంశీ.. కోహ్లీ, రోహిత్ శ‌ర్మ‌ల‌కు సాధ్యం కానీ రికార్డు..

ఈ సీజ‌న్‌లో ముంబై ఇండియ‌న్స్ మ‌రో ఆరు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఈ ఆరు మ్యాచ్‌ల్లోనూ ముంబై జ‌ట్టు విజ‌యం సాధిస్తే అప్పుడు వారి ఖాతాలో 16 పాయింట్లు ఉంటాయి. అప్పుడు టాప్-4లో నిలిచి ముంబై ప్లేఆప్‌లో అడుగుపెట్టే అవ‌కాశాలు ఉన్నాయి. అలా కాకుండా ఒక్క మ్యాచ్‌లో ఓడిపోయిన‌ప్ప‌టికి కూడా ఆ జ‌ట్టు ఈ టోర్నీ నుంచి ఇంటి ముఖం ప‌ట్ట‌క‌త‌ప్ప‌దు.

ముంబై ఆడ‌నున్న మ్యాచ్‌లు ఇవే..

* మే 2న – చెన్నై సూప‌ర్ కింగ్స్ తో
* మే 4న – ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌తో
* మే 10న – రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరుతో
* మే 14న – పంజాబ్ కింగ్స్‌
* మే 20న – కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్‌
* మే 24న – రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌