MS Dhoni: టాస్ ఎలా గెలవాలో ఎంఎస్ ధోనీ నుంచి నేర్చుకోవాలి – మిథాలీ రాజ్

టాస్ లు ఓడిపోవడం కూడా హాట్ టాపిక్ గా మారింది. దీనిపై మ్యాచ్ అనంతరం సమావేశంలో అడిగిన ప్రశ్నలకు ఫన్నీ జవాబిచ్చారు.

Ms Dhoni Mithali Raj

MS Dhoni: చారిత్రక పింక్ బాల్ టెస్టు మ్యాచ్‌ను ఆస్ట్రేలియా మహిళలతో కలిసి ఆడిన ఇండియా మహిళా జట్టు డ్రాగా ముగించింది. తొలిసారి ఈ ఫార్మాట్ ను ఫేస్ చేసిన టీమిండియా మహిళల జట్టు అసాధారణ ప్రతిభతో ఆకట్టుకుంది. ఈ సందర్భంగా మ్యాచ్ అనంతరం మాట్లాడిన కెప్టెన్ మిథాలీ రాజ్..

‘మేం డిక్లేర్ చేసిన సమయంలో ఒక ట్రిక్ ఉంది. 15ఓవర్లలో 8వికెట్లు తీయగలిగాం’ అని అన్నారు. డే అండ్ నైట్ టెస్టులో టీం ప్లేయర్ల పర్‌ఫార్మెన్స్ గురించి వివరించారు. ఆస్ట్రేలియాతో ఆడిన బెస్ట్ మ్యాచ్ ఇదేనని చెప్పారు. 2014లో ఎనిమిది అరంగ్రేట ప్లేయర్లతో ఇంగ్లాండ్ తో ఆడి గెలిచామని గుర్తు చేసుకన్నారు. యాషెస్ టెస్టును గెలవగలిగామని.. అది చాలా గ్రేట్. మా ప్లేయర్లు గ్రేట్ షో చూపించగలిగారని మిథాలీ సమధానమిచ్చారు.

కెప్టెన్ గా మిథాలీ పేరిట మంచి పేరే ఉంది. అలాగే టాస్ లు ఓడిపోవడం కూడా హాట్ టాపిక్ గా మారింది. దీనిపై మ్యాచ్ అనంతరం సమావేశంలో అడిగిన ప్రశ్నలకు ఫన్నీ జవాబిచ్చారు. టాస్ ఓడిపోవడంలో నా చరిత్ర కొనసాగుతూనే ఉంది. అందరూ టాస్ ఓడిపోవడం గురించి నన్ను అంటుంటే.. నాకు కూడా ఎంఎస్ ధోనీ నుంచి నేర్చుకోవాలని ఉంది’ అని సెటైరికల్ రిప్లై ఇచ్చారు.

Rashi Khanna: సెగలు రేపే సొగసుతో రాశీ ఖన్నా రచ్చ!