Nepal beat West Indies in Sharjah register first ever t20 win over a full icc member
WI vs NEP : టీ20 క్రికెట్‌లో నేపాల్ సంచలన విజయం సాధించింది. షార్జా వేదికగా వెస్టిండీస్‌తో (WI vs NEP) జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో 19 పరుగుల తేడాతో గెలుపొందింది. పూర్తి స్థాయి టెస్టు హోదా కలిగిన దేశాల పై నేపాల్ టీ20 మ్యాచ్‌ల్లో విజయం సాధించడం ఇదే తొలిసారి. కాగా.. ఈ విజయంతో మూడు మ్యాచ్‌లో టీ20 సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి నేపాల్ దూసుకువెళ్లింది.
ఈ మ్యాచ్‌లో నేపాల్ తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 148 పరుగులు సాధించింది. నేపాల్ బ్యాటర్లలో కెప్టెన్ రోహిత్ పాడెల్ (35 బంతుల్లో 38 పరుగులు), కుశాల్ మల్లా (21 బంతుల్లో 30 పరుగులు), గుల్సన్ ఝా (16 బంతుల్లో 22 పరుగులు) రాణించారు. వెస్టిండీస్ బౌలర్లలో జేసన్ హోల్డర్ నాలుగు వికెట్లు తీశాడు. నవీన్ బిడైసీ మూడు వికెట్లు సాధించాడు. అకిల్ హోసేన్ ఓ వికెట్ పడగొట్టాడు.
అనంతరం 149 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన వెస్టిండీస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 129 పరుగులు చేసింది. విండీస్ బ్యాటర్లలో నవీన్ బిడైసీ (25 బంతుల్లో 22 పరుగులు), అమీర్ జాంగూ (22 బంతుల్లో 19 పరుగులు), ఫాబియన్ అలెన్ (14 బంతుల్లో 19 పరుగులు), అకిల్ హోసేన్ (9 బంతుల్లో 18 పరుగులు) పర్వాలేదనిపించారు.
🚨 THE HISTORIC MOMENT 🚨
– NEPAL WON A MATCH AGAINST THE FULL MEMBER NATION FOR THE FIRST TIME EVER…!!!
The Rising team in International cricket. pic.twitter.com/4EjGZy1Ut9
— Johns. (@CricCrazyJohns) September 27, 2025
కైల్ మేయర్స్ (8 బంతుల్లో 5 పరుగులు), జేసన్ హోల్డర్ (7 బంతుల్లో 5 పరుగులు) ఘోరంగా విఫలం అయ్యారు. నేపాల్ బౌలర్లలో కుషాల్ భూర్తెల్ రెండు వికెట్లు తీశాడు. రోహిత్ పౌడెల్, లలిత్ రాజ్‌బన్షి, నందన్ యాదవ్, కరణ్ కెసి, దీపేంద్ర సింగ్ ఐరీ తలా ఓ వికెట్ పడగొట్టారు.