Asian Games: ఆసియా క్రీడల్లో చరిత్ర సృష్టించిన నేపాల్ క్రికెట్ జట్టు.. యువరాజ్, రోహిత్ రికార్డులు బద్దలు

315 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన మంగోలియా జట్టు కేవలం 13.1 ఓవర్లలో 41 పరుగులకు ఆలౌట్ అయింది. ఫలితంగా నేపాల్ జట్టు 273 పరుగుల తేడాతో విజయం సాధించింది.

Nepal Cricket team

Nepal Cricket team creates history: ఆసియా క్రీడల్లో నేపాల్ క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. టీ20 ఫార్మాట్‌లో రికార్డులను బద్దలు కొట్టింది. ఆ జట్టు బ్యాటర్లు మైదానంలో పరుగుల వరద పారించారు. ఆసియా క్రీడల్లో పురుషుల క్రికెట్ పోటీల్లో భాగంగా బుధవారం హాంగ్‌జౌలోని పింగ్‌ఫెంగ్ క్యాంపస్ క్రికెట్ స్టేడియంలో నేపాల్ వర్సెస్ మంగోలియా జట్ల మధ్య మొదటి మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన మంగోలియా నేపాల్‌ జట్టుకు తొలుత బ్యాటింగ్ అవకాశం ఇచ్చింది. నేపాల్ బ్యాటర్లు మొదటి నుంచి బౌండరీల వర్షం కురిపించారు. ఫలితంగా 20 ఓవర్లలో ఆ జట్టు మూడు వికెట్లు మాత్రమే నష్టపోయి 314 పరుగులు చేసింది. టీ20 చరిత్రలో ఇదే అత్యుత్తమ స్కోర్ కావటం గమనార్హం. ఆసియా క్రీడల్లో జరిగే మ్యాచ్ లకు టీ20 హోదాను మంజూరు చేస్తున్నట్లు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) గతంలో ధృవీకరించింది.

Asian Games 2023 : మహిళల షూటింగ్ 25 మీటర్ల టీమ్ ఈవెంట్‌లో భారత్‌కు బంగారు పతకం

మరోవైపు నేపాల్ జట్టుకు చెందిన 23ఏళ్ల కుడిచేతి బ్యాటర్ దీపేంద్ర సింగ్ ఎయిరీ ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి ఎనిమిది సిక్స్‌ల సహాయంతో తొమ్మిది బంతుల్లోనే ఆఫ్ సెంచరీ (50 పరుగులు) పూర్తి చేశాడు. మొత్తం 10 బంతుల్లో 52 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. 2007 టీ20 ప్రపంచ కప్‌లో ఇంగ్లాండ్‌ఫై యువరాజ్ సింగ్ 12 బంతుల్లో 50 పరుగులు పూర్తిచేసి ప్రపంచంలోనే వేగంగా ఆఫ్ సెంచరీ చేసిన బ్యాటర్ గా రికార్డుల్లో నిలిచాడు. ప్రస్తుతం దిపేంద్ర సింగ్ తన సుడిగాలి బ్యాటింగ్‌తో యువరాజ్ రికార్డ్‌ను బద్దలు కొట్టాడు.

DIPENDRA SINGH fastest T20 fifty from just 9 balls in Asian Games

Asian Games : ఈక్వస్ట్రియన్‌లో చ‌రిత్ర సృష్టించిన భార‌త్.. 41 ఏళ్ల త‌రువాత బంగారు పతకం

మరోవైపు నేపాల్ బ్యాటర్ కుషాల్ మల్లా కేవలం 34 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు. ఫలితంగా భారత్ కెప్టెన్ రోహిత్ శర్మ, దక్షిణాఫ్రికా స్టార్ బ్యాటర్ డేవిడ్ మిల్లర్ లు క్రియేట్ చేసిన (35 బంతుల్లోనే 100 పరుగులు) రికార్డును కుషాల్ మల్లా బద్దలు కొట్టాడు. మొత్తంగా కుషాల్ ముల్లా 50 బంతుల్లో 137 పరుగులు (12 సిక్స్‌లు, 8 ఫోర్లు) చేసి నాటౌట్‌గా నిలిచాడు. మరోవైపు జట్టు కెప్టెన్ రోహిత్ పౌడెల్ 27 బంతుల్లో 61 పరుగులు చేశాడు. కుషాల్, రోహిత్ ఇద్దరు కలిపి 193 పరుగులు భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.

Kushal Malla scored the fastest ever T20 hundred 34 balls

Asian Games: ఆసియా క్రీడల్లో భారత్‌కు మరో స్వర్ణం.. శ్రీలంకపై భారత్ ఉమెన్స్ జట్టు ఘన విజయం

315 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన మంగోలియా జట్టు కేవలం 13.1 ఓవర్లలో 41 పరుగులకు ఆలౌట్ అయింది. ఫలితంగా నేపాల్ జట్టు 273 పరుగుల తేడాతో విజయం సాధించింది. టీ20 ఫార్మాట్ లో అత్యధిక పరుగుల తేడాతో విజయం సాధించిన జట్లుగా నిలిచింది.

టీ20 చరిత్రలో అత్యధిక స్కోర్లు చేసిన జట్లు ..
నేపాల్ – 314/4 vs మంగోలియా (2023)
ఆఫ్ఘనిస్తాన్ – 278/3 vs ఐర్లాండ్ (2019)
చెక్ రిపబ్లిక్ – 278/4 vs టర్కీ (2019)
ఆస్ట్రేలియా – 263/3 vs శ్రీలంక (2016)
శ్రీలంక 260/6 vs కెన్యా (2007)

 

ట్రెండింగ్ వార్తలు