Netzens satires on Uppal cricket stadium's dirty chairs
Uppal Stadium: ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా టీ-20 క్రికెట్ మ్యాచ్ సెప్టెంబర్ 25న హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో జరనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ మ్యాచ్కు సంబంధించి టికెట్ల పంపిణీ తీవ్ర వివాదాస్పదమైంది. టికెట్ల పంపిణీలో కుంభకోణం జరిగిందనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఈ రగడ పక్కన కాసేపు పక్కన పెడితే.. ఉప్పల్ స్టేడియంపై నెటిజెన్లు, క్రికెట్ అభిమానులు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. కొందరైతే సర్ఫ్, నీళ్లు తీసుకెళ్లమంటూ సెటైర్లు వేస్తున్నారు. కారణం, స్టేడియంలోని సీట్లు పక్షుల రెట్టలతో నిండిపోవడం.
Pack ur bags and come to uppal stadium ??@KTRoffice@Sagar4BJP pic.twitter.com/m4ht95hZDV
— Shiva Chary (@ShivaChary55) September 24, 2022
స్టేడియంలోని కుర్చీల ఫొటోలను నెట్టింట్లో షేర్ చేస్తూ ‘‘టికెట్లు దక్కించుకుని మ్యాచ్‌ను కళ్లారా వీక్షేందుకు వెళ్లాలనుకున్న వారికి చిన్న సూచన. మ్యాచ్ చూసేందుకు ఆశగా పొలోమని వెళ్లిపోకుండా బకెట్ నీళ్లు, సబ్బు, చిన్న టవల్ లాంటిది కూడా వెంట తీసుకెళ్లడం బెటర్’’ అంటూ సెటైర్లు విసురుతున్నారు. నిత్యం వివాదాల్లో మునిగితేలే హెచ్‌సీఏ పెద్దలకు స్టేడియం నిర్వహణ పట్టకుండా పోయిందని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్టేడియం ఇంత దరిద్రంగా ఉంటే బీసీసీఐ ఏం చేస్తోందని కూడా మరికొందరు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
మ్యాచ్ టికెట్లు ఉన్నవాళ్లు రెండు బకెట్ల నీళ్లు, ఇంత సర్ఫ్ తీసుకెళ్లండి..మీరే కడుక్కుని కూర్చోవాలి…@hycricket_HCA ?? pic.twitter.com/9Qwf0jGe9G
— HEMA NIDADHANA (@Hema_Journo) September 24, 2022
ఉప్పల్ స్టేడియంలో చివరి మ్యాచ్ జరిగి దాదాపు మూడేళ్లు అయింది. ఆ తర్వాత ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ కూడా జరగకపోవడంతో స్టేడియం నిర్వహణను హెచ్‌సీఏ గాలికి వదిలేసింది. ఫలితంగా సీట్లు అన్నీ పాడైపోయి, పెచ్చులు లేచిపోయి చూడ్డానికే వికారంగా ఉన్నాయి. స్టేడియంలో ఎక్కడ చూసినా నిర్వహణలోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. కనీసం చీపు పట్టి ఊడ్చిన సందర్భాలు కూడా లేవు. స్టేడియంలోని సీట్లు, లోపలి పరిస్థితులకు అద్దం పట్టే ఫొటోలు వెలుగులోకి రావడంతో హెచ్‌సీఏపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.