నేపియర్ వన్డే : సొంత గడ్డపై భారత్‌తో తొలి వన్డేలో న్యూజిలాండ్‌కు వరుస ఎదురుదెబ్బలు తగిలాయి. ఆదిలోనే ఓపెనర్ల(గప్తిల్, మన్రో) వికెట్లను కోల్పోయింది. ఆ తర్వాత కాసేపటికే మరో రెండు వికెట్లు పడ్డాయి. 52 పరుగుల స్కోర్
నేపియర్ వన్డే : సొంత గడ్డపై భారత్‌తో తొలి వన్డేలో న్యూజిలాండ్‌కు వరుస ఎదురుదెబ్బలు తగిలాయి. ఆదిలోనే ఓపెనర్ల(గప్తిల్, మన్రో) వికెట్లను కోల్పోయింది. ఆ తర్వాత కాసేపటికే మరో రెండు వికెట్లు పడ్డాయి. 52 పరుగుల స్కోర్ వద్ద రాస్ టేలర్, 76 పరుగుల స్కోర్ వద్ద లాథమ్ ఔటయ్యారు. రాస్ టేలర్, లాథమ్‌ను చాహల్ పెవిలియన్ పంపాడు.
టాస్ గెలిచిన కివీస్ కెప్టెన్ విలియమ్‌సన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఆతిథ్య న్యూజిలాండ్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బలు తగిలాయి. ఓపెనర్లు గప్తిల్, మన్రో ఇద్దరూ పెవిలియన్‌కు చేరారు. ఈ రెండు వికెట్లూ భారత పేస్ బౌలర్ షమీకే దక్కాయి. షమీ వేసిన 2వ ఓవర్ 5వ బంతికి గప్తిల్ (5) ఔటవగా.. 4వ ఓవర్ 3వ బంతికి మన్రో (8) వెనుదిరిగాడు. ఈ ఇద్దరూ క్లీన్‌బౌల్డ్ అయ్యారు.
5 వన్డేల సిరీస్‌లో భాగంగా తొలి వన్డేకి నేపియర్ వేదికైంది. ఆస్ట్రేలియాను సొంతగడ్డపై ఇటు టెస్టుల్లో, అటు వన్డేల్లో చిత్తు చేసి టీమిండియా జోష్ మీదుంది. బలమైన జట్టు, మంచి ఫామ్, సొంతగడ్డపై ఆడుతున్న సానుకూలత.. ఇవన్నీ న్యూజిలాండ్‌కు ప్లస్. దీంతో హోరాహోరీ పోరు ఖాయంగా కనిపిస్తోంది. న్యూజిలాండ్ పర్యటనలో భాగంగా భారత్ 5 వన్డేలతో పాటు 3 టీ20 మ్యాచ్‌లు ఆడనుంది.