NZ vs SA : కీలక మ్యాచ్‌లో టాస్ ఓడిపోయిన దక్షిణాఫ్రికా.. ఫస్ట్ బ్యాటింగ్
ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా అక్లాండ్ వేదికగా న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా జట్లు (NZ vs SA) మూడో టీ20 మ్యాచ్‌లో తలపడుతున్నాయి.
- Thota Vamshi Kumar
- Published On : March 20, 2026 / 12:19 PM IST
NZ vs SA 3rd T20 New Zealand opt to bowl
- అక్లాండ్ వేదికగా మూడో టీ20 మ్యాచ్
- టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న కివీస్
- దక్షిణాఫ్రికా ఫస్ట్ బ్యాటింగ్
NZ vs SA : ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా అక్లాండ్ వేదికగా న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా జట్లు మూడో టీ20 మ్యాచ్‌లో తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కివీస్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో దక్షిణాఫ్రికా తొలుత బ్యాటింగ్ చేయనుంది. తొలి టీ20 మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా, రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్ జట్లు విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మూడో టీ20 మ్యాచ్‌లో విజయం సాధించి సిరీస్‌లో ఆధిక్యంలోకి దూసుకువెళ్లాలని ఇరు జట్లు భావిస్తున్నాయి.
‘ముందుగా మేము బౌలింగ్ చేస్తాము. ఇది మంచి వికెట్‌లాగా కనిపిస్తోంది. పిచ్ పై కాస్త గడ్డి ఉంది. కొత్త బంతితో పేసర్లకు బౌన్స్, స్వింగ్ లభించవచ్చు. కాబట్టి ఆరంభంలో సాధ్యమైనన్ని వికెట్లు తీసి ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెడతాము. తక్కువ స్కోరుకే పరిమితం చేస్తామని భావిస్తున్నాము.’ అని న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ అన్నాడు.
Sanju samson : సంజూ శాంసన్‌కు గోల్డెన్ ఛాన్స్.. ధోని క్లబ్‌లో చేరే సువర్ణావకాశం..
‘గత మ్యాచ్‌లో ఓడిపోవడం కాస్త నిరాశ కలిగించింది. అయినప్పటికి ఈ మ్యాచ్ కోసం మేము బాగా సన్నద్ధం అయ్యాము. పిచ్ బాగుంది. తొలుత బ్యాటింగ్ వల్ల పిచ్ పై ఓ అవగాహనకు రావొచ్చు. భారీ స్కోరు చేసి ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెడతాము. మా అత్యుత్తమ ఆటను ప్రదర్శిస్తాము.’ అని దక్షిణాఫ్రికా కెప్టెన్ కేశవ్ మహారాజ్ తెలిపాడు.
దక్షిణాఫ్రికా తుది జట్టు..
వియాన్ ముల్డర్, టోనీ డి జోర్జీ, కానర్ ఎస్టర్‌హుయిజెన్(వికెట్ కీపర్), రూబిన్ హెర్మాన్, జాసన్ స్మిత్, డయాన్ ఫోరెస్టర్, జార్జ్ లిండే, గెరాల్డ్ కోట్జీ, కేశవ్ మహారాజ్(కెప్టెన్), న్కోబాని మోకోయెనా, లుథో సిపమ్లా
Virat Kohli : ఐపీఎల్‌లో 9 వేల పరుగుల క్లబ్‌లో చేరేందుకు విరాట్ కోహ్లీకి ఎన్ని రన్స్ కావాలంటే?
న్యూజిలాండ్ తుది జట్టు..
డెవాన్ కాన్వే, టామ్ లాథమ్(వికెట్ కీపర్), టిమ్ రాబిన్సన్, నిక్ కెల్లీ, బెవాన్ జాకబ్స్, మిచెల్ సాంట్నర్(కెప్టెన్), జేమ్స్ నీషమ్, కోల్ మెక్‌కాంచీ, కైల్ జామీసన్, బెన్ సియర్స్, లాకీ ఫెర్గూసన్.
