NZ vs SA : న్యూజిలాండ్‌కు భారీ షాక్‌.. ద‌క్షిణాఫ్రికాదే టీ20 సిరీస్‌.. ఐదో టీ20లో కివీస్ పై సౌతాఫ్రికా ఘ‌న విజ‌యం

సొంత గ‌డ్డ‌పై న్యూజిలాండ్ కు ప‌రాభ‌వం ఎదురైంది. 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను ద‌క్షిణాఫ్రికాకు (NZ vs SA) కోల్పోయింది.

NZ vs SA South Africa win by 33 runs in 5th T20 and won the series against New Zealand

  • ఐదో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్ పై ఘ‌న విజ‌యం
  • 3-2 తేడాతో టీ20 సిరీస్ ద‌క్షిణాఫ్రికా కైవ‌సం

NZ vs SA : సొంత గ‌డ్డ‌పై న్యూజిలాండ్ కు ప‌రాభ‌వం ఎదురైంది. 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను ద‌క్షిణాఫ్రికాకు కోల్పోయింది. బుధ‌వారం క్రైస్ట్‌చర్చ్ వేదిక‌గా జ‌రిగిన‌ ఐదో టీ20 మ్యాచ్‌లో ద‌క్షిణాఫ్రికా జ‌ట్టు 33 ప‌రుగుల తేడాతో న్యూజిలాండ్ పై (NZ vs SA ) గెలుపొందింది. త‌ద్వారా టీ20 సిరీస్‌ను 3-2తో కైవ‌సం చేసుకుంది.

IPL : జట్ల మీద వేల కోట్లు జల్లుతున్నారు.. ఐపీఎల్‌లో వీళ్లకి డబ్బెలా వస్తుంది? రాబడి ఎలా?

ఈ మ్యాచ్‌లో ద‌క్షిణాఫ్రికా జ‌ట్టు తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 4 వికెట్ల న‌ష్టానికి 187 ప‌రుగులు సాధించింది. స‌ఫారీ బ్యాట‌ర్ల‌లో కానర్ ఎస్టర్‌హుయిజెన్ (75; 33 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్స‌ర్లు) విధ్వంస‌క‌ర హాప్ సెంచ‌రీ చేశాడు. రూబిన్ హెర్మాన్ (39), వియాన్ ముల్డర్ (31), డయాన్ ఫోరెస్టర్ (21 నాటౌట్‌) రాణించారు. న్యూజిలాండ్ బౌల‌ర్ల‌లో బెన్ సియర్స్ రెండు వికెట్లు ప‌డ‌గొట్టాడు. జాకరీ ఫౌల్క్స్, జోష్ క్లార్క్సన్ చెరో వికెట్ సాధించాడు.

Shane Warne : భారీ మొత్తానికి అమ్ముడుపోయిన రాజ‌స్థాన్.. షేన్ వార్న్ కుటుంబానికి జాక్‌పాట్‌.. కోట్ల రూపాయ‌లు

అనంత‌రం 188 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్ల న‌ష్టానికి 154 ప‌రుగులకే ప‌రిమిత‌మైంది. కివీస్ బ్యాట‌ర్ల‌లో బెవోన్ జాకబ్స్ ( 36; 19 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స‌ర్లు) రాణించాడు. జేమ్స్ నీష‌మ్ (24),డేన్ క్లీవర్ (24) లు ప‌ర్వాలేద‌నిపించారు. ద‌క్షిణాఫ్రికా బౌల‌ర్ల‌లో ఒట్నీల్ బార్ట్‌మాన్, గెరాల్డ్ కోట్జీ, వియాన్ ముల్డర్ లు త‌లా రెండు వికెట్లు సాధాంచారు. కేశవ్ మహారాజ్ ఓ వికెట్ ప‌డ‌గొట్టారు.