NZ vs SA : నాలుగో టీ20 మ్యాచ్‌లో కివీస్ పై దక్షిణాఫ్రికా విజయం.. రసకందాయంలో సిరీస్..
వెల్లింగ్టన్ వేదికగా జరిగిన నాలుగో టీ20 మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా జట్టు న్యూజిలాండ్‌పై 19 పరుగుల తేడాతో విజయాన్ని సాధించింది.
- Thota Vamshi Kumar
- Published On : March 22, 2026 / 05:19 PM IST
South Africa won by 19 runs against New Zealand in 4th T20
- నాలుగో టీ20 మ్యాచ్‌లో కివీస్ పై విజయం
- ఐదు మ్యాచ్‌ల సిరీస్ ను 2-2తో సమం చేసిన సౌతాఫ్రికా
NZ vs SA : న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ రసవత్తరంగా మారింది. ఆదివారం వెల్లింగ్టన్ వేదికగా జరిగిన నాలుగో టీ20 మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా జట్టు 19 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌పై విజయాన్ని సాధించింది. దీంతో సిరీస్ 2-2తో సమమైంది. ఇక నిర్ణయాత్మకమైన ఐదో టీ20 మ్యాచ్ (NZ vs SA) క్రైస్ట్‌చర్చ్ వేదికగా బుధవారం (మార్చి 25) జరగనుంది.
🚨 MATCH RESULT 🚨
An extraordinary game of cricket comes to an end in Wellington as #TheProteas secure a thrilling 19-run victory! 🇿🇦😎
Incredible scenes as the five-match T20I series is level at 2-2, with the decider set for March 25th. 💥🏏
📸: @PhotosportNZ #Unbreakable pic.twitter.com/dXzY97PdIw
— Proteas Men (@ProteasMenCSA) March 22, 2026
నాలుగో టీ20 మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాప్రికా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. సౌతాఫ్రికా బ్యాటర్లలో కానర్ ఎస్టర్‌హుయిజెన్ (57; 36 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లు) హాఫ్ సెంచరీ చేశాడు. రూబిన్ హెర్మాన్ (28 నాటౌట్), టోనీ డి జోర్జీ (23) లు రాణించారు. న్యూజిలాండ్ బౌలర్లలో కైల్ జేమీసన్ రెండు వికెట్లు పడగొట్టాడు. జాకరీ ఫౌల్క్స్, బెన్ సియర్స్, కోల్ మెక్‌కాంచీ లు తలా ఓ వికెట్ పడగొట్టారు.
Rishabh Pant : 6 బాల్స్‌లో 15 రన్స్ ఛాలెంజ్.. రిషబ్ పంత్ ఓడిపోయాడా? గెలిచాడా? వీడియో వైరల్..
అనంతరం 165 పరుగుల లక్ష్య ఛేదనలో న్యూజిలాండ్ 18.5 ఓవర్లలో 145 పరుగులకే కుప్పకూలింది. కివీస్ బ్యాటర్లలో టిమ్ రాబిన్సన్ (32), డేన్ క్లీవర్ (26)లు రాణించారు. మిగిలిన వారు ఘోరంగా విఫలం కావడంతో కివీస్‌కు ఓటమి తప్పలేదు. సౌతాఫ్రికా బౌలర్లలో జెరాల్డ్ కోట్జీ మూడు వికెట్లు తీశాడు. ఒట్నీల్ బార్ట్‌మన్, ప్రేనెలన్ సుబ్రాయెన్, కేశవ్ మహారాజ్ లు తలా రెండు వికెట్లు పడగొట్టారు. వియాన్ ముల్డర్ ఓ వికెట్ సాధించాడు.
