Rishabh Pant : 6 బాల్స్‌లో 15 రన్స్ ఛాలెంజ్.. రిషబ్ పంత్ ఓడిపోయాడా? గెలిచాడా? వీడియో వైరల్..
లక్నో కోచింగ్ బృందం రిషబ్ పంత్(Rishabh Pant)కు ఓ ఛాలెంజ్ ఇచ్చింది.
Lucknow Super Giants 6 balls 15 runs challange to rishabh pant
- మార్చి 28 నుంచి ఐపీఎల్
- ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తున్న లక్నో
- రిషబ్ పంత్‌కు సవాల్ విసిరిన కోచింగ్ బృందం
Rishabh Pant : మార్చి 28 నుంచి ఐపీఎల్ 2026 ప్రారంభం కానుంది. ఈ మెగాటోర్నీ కోసం రిషబ్ పంత్ సారథ్యంలో లక్నో సూపర్ జెయింట్స్ ప్రాక్టీస్ ను ముమ్మరం చేసింది. అయితే.. ఓ జట్టు లక్ష్యాన్ని ఛేదించాల్సి వచ్చినప్పుడు ఆఖరి ఓవర్లో 15 నుంచి 20 పరుగులు చేయాల్సిన సందర్భాలు ఐపీఎల్లో చాలా సార్లు చూశాము. ఎవరైతే ఒత్తిడిని తట్టుకుని పరుగులు సాధిస్తారో వారే మ్యాచ్‌లను గెలుస్తారు.
అలాంటి సందర్భమే ఎదురైతే రిషబ్ పంత్ (Rishabh Pant) ఎలా ఆడతాడో చూడాలని లక్నో బౌలింగ్ బృందం భావించింది. వెంటనే అతడికి ఓ సవాల్ విసిరింది. 6 బంతుల్లో 15 పరుగులు చేయాలని చెప్పింది. ఈ ఛాలెంజ్‌ను స్వీకరించిన రిషబ్ పంత్ వెంటనే బ్యాట్ పట్టుకుని క్రీజులోకి వెళ్లాడు.
LSG : ఐపీఎల్ 2026లో లక్నో సూపర్ జెయింట్స్ రాతమారేనా?
తొలి బంతిని ఫోర్‌గా మలిచాడు. అయితే.. రెండో, మూడో బంతికి సింగిల్స్ తీశాడు. ఆ తరువాత వరుసగా 4, 4, 6 సిక్స్ బాదాడు. మొత్తంగా 6 బంతుల్లో 20 పరుగులు చేసి విజయవంతంగా ఛాలెంజ్‌ను పూర్తి చేశాడు. అయితే.. మధ్యలో ఓ సారి భారీ షాట్ కొట్టబోవడంతో బ్యాట్ అతడి చేతుల్లోంచి చేజారింది. ఆ బంతిని డెడ్ బాల్‌గా ప్రకటించారు. మొత్తంగా ఈ ఛాలెంజ్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
