IND vs NED Match
IND vs NED Match: బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో టీమిండియా బ్యాటర్లు సిక్సర్ల మోతమోగించారు. ఆదివారం వన్డే వరల్డ్ కప్ 2023లో చివరి లీగ్ మ్యాచ్ ఇండియా వర్సెస్ నెదర్లాండ్స్ జట్ల మధ్య జరిగింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా బ్యాటర్లు ఆది నుంచి ఫోర్లు, సిక్సర్ల మోతమోగించారు. రోహిత్, గిల్, విరాట్ కోహ్లీలు ఆఫ్ సెంచరీలు చేయగా.. శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ సెంచరీలు చేశారు. దీంతో 50 ఓవర్లకు టీమిండియా నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి 410 పరుగులు చేసింది.
ఆ తరువాత బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్ జట్టు 47.5 ఓవర్లలో 250 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో ఇండియా 160 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ఇండియా వర్సెస్ నెదర్లాండ్స్ మ్యాచ్ కు సంబంధించిన హైలెట్స్ వీడియోను ఐసీసీ అధికారిక ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది.