Teamindia
Virat Kohli – Ravindra Jadeja : స్వదేశంలో జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో టీమ్ఇండియా తనకు ఎదురేలేదని నిరూపించుకుంది. వరుసగా ఎనిమిదో మ్యాచ్‌లోనూ విజయం సాధించింది పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని పదిలం చేసుకుంది. కోల్‌కతా వేదికగా జరిగిన మ్యాచ్‌లో 327 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 27.1 ఓవర్లలో 83 పరుగులకు ఆలౌటైంది. ఫలితంగా 220 పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ సెంచరీ చేశాడు. ఇదేసమయంలో సచిన్ టెండూల్కర్ 49 సెంచరీల రికార్డును సమం చేశాడు. మరోవైపు బౌలింగ్ విభాగంలో రవీంద్ర జడేజా ఐదు వికెట్లు తీసి దక్షిణాఫ్రికా జట్టు ఓటమిలో కీలక భూమిక పోషించిన విషయం తెలిసిందే.
దక్షిణాఫ్రికాపై విరాట్, జడేజా అద్భుత ప్రదర్శన తరువాత టీమిండియా సభ్యులు డ్రెస్సింగ్ రూంలో సందడి చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఈ వీడియోలో విరాట్ కోహ్లీ 35వ పుట్టినరోజు సందర్భంగా పుట్టిన రోజు కేక్ తో పాటు, జడేజా ఐదు వికెట్లు తీసిన సందర్భంగా ఇద్దరితో కేక్ లను కట్ చేయించారు. రెండు కేకులను టేబుల్ పై ఉంచగా.. విరాట్, జడేజాలు కట్ చేశారు. టీమిండియా సభ్యుల సంబరాల్లో బీసీసీఐ కార్యదర్శితో పాటు బోర్డు సభ్యులు కూడా పాల్గొన్నారు.
Team India and officials celebrating Virat Kohli and Ravindra Jadeja's performance. pic.twitter.com/DBy8pszfWp
— Mufaddal Vohra (@mufaddal_vohra) November 6, 2023