Team India Video: భారత్-పాక్ మ్యాచ్ వేడి షురూ.. అహ్మదాబాద్ చేరుకుని హాయ్ చెప్పిన టీమిండియా

ప్రపంచ కప్-2023లో ప్రేక్షకులు శనివారం అసలు సిసలైన మ్యాచును చూడబోతున్నారు.

ODI World Cup 2023

ODI World Cup-2023: ప్రపంచ కప్-2023లో శనివారం అసలుసిసలైన మ్యాచ్ జరగనుంది. భారత్-పాకిస్థాన్ గుజరాత్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా ఇవాళ అహ్మదాబాద్ చేరుకుంది. ఇందుకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.

అహ్మదాబాద్ విమానాశ్రయం చేరుకున్నాక భారత జట్టు సభ్యులు అభిమానులకు హాయ్ చెబుతూ అక్కడి నుంచి ప్రత్యేక బస్సులో హోటల్ కు వెళ్లారు. ప్రపంచ కప్-2023లో భారత్ ఇప్పటివరకు రెండు మ్యాచులు ఆడి గెలిచింది.

మొదటి మ్యాచ్ ఆస్ట్రేలియాతో, రెండో మ్యాచ్ అఫ్గానిస్థాన్ తో జరిగింది. పాకిస్థాన్ కూడా తొలి రెండు మ్యాచుల్లో గెలిచింది. మొదటి మ్యాచు నెదర్లాండ్స్ తో, రెండో మ్యాచు శ్రీలంకతో ఆడింది.

ప్రపంచ కప్-2023 పాయింట్ల పట్టికలో భారత్ రెండో స్థానంలో ఉండగా, పాకిస్థాన్ మూడో స్థానంలో ఉంది. అగ్రస్థానంలో న్యూజిలాండ్ ఉంది. ఈ మూడు జట్ల పాయింట్లు నాలుగేసి చొప్పున ఉన్నాయి. రన్ రేట్ పరంగా న్యూజిలాండ్ కు అగ్రస్థానం దక్కింది.

Shubhman Gill : గిల్ వచ్చేశాడు..! అహ్మదాబాద్ కు చేరుకున్న యువ ప్లేయర్.. పాక్‌తో మ్యాచ్‌కు బరిలోకి?