Pakistan Fan : ట్రాక్ట‌ర్ అమ్మేసా.. పాక్ ఓడిపోయింది..ఇప్పుడెలా..?

దాయాదులు భార‌త్, పాకిస్తాన్ జ‌ట్ల మ‌ధ్య జ‌రిగే మ్యాచుల‌కు ఉండే క్రేజే వేరు

Pakistan fan sold his tractor to buy ticket for match against India

దాయాదులు భార‌త్, పాకిస్తాన్ జ‌ట్ల మ‌ధ్య జ‌రిగే మ్యాచుల‌కు ఉండే క్రేజే వేరు. అలాంటిది ఈ రెండు జ‌ట్లు టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో త‌ల‌ప‌డుతున్నాయంటే ఇక చెప్పేది ఏముంది..? త‌మ జ‌ట్టే గెల‌వాల‌ని ఇరుజ‌ట్ల అభిమానులు కోరుకుంటుంటారు. ఇక ఈ మ్యాచ్‌ను ప్ర‌త్య‌క్షంగా చూడాల‌ని చాలా మంది భావిస్తుంటారు. అలాగే పాకిస్తాన్‌కు చెందిన ఓ అభిమాని మ్యాచ్ చూసేందుకు అని త‌న‌కు జీవ‌నాధార‌మైన ట్రాక్ట‌ర్‌ను అమ్ముకుని మ‌రీ ఆదివారం న్యూయార్క్‌లోని నస్సౌ కౌంటీ స్టేడియంలో భార‌త్‌, పాకిస్తాన్ జ‌ట్ల మ‌ధ్య జరిగిన భార‌త‌టీ20 ప్రపంచకప్ ను ప్ర‌త్య‌క్షంగా వీక్షించాడు.

ఉత్కంఠభ‌రితంగా సాగిన ఈ మ్యాచ్‌లో ఆఖ‌రికి 6 ప‌రుగుల తేడాతో భార‌త్ విజ‌యం సాధించింది. దీంతో స‌ద‌రు అభిమానికి నిరాశ త‌ప్ప‌లేదు. దీనిపై స‌ద‌రు అభిమాని ఏఎన్ఐతో మాట్లాడాడు.. తాను 3000 యూఎస్ డాల‌ర్లు (భార‌త క‌రెన్సీలో దాదాపు రూ.2.5లక్ష‌లు) పెట్టి మ్యాచ్ టికెట్‌ను కొన్నట్లు చెప్పాడు. ఇందుకోసం త‌న జీవ‌నాధార‌మైన ట్రాక్ట‌ర్‌ను సైతం అమ్మేసిన‌ట్లు తెలిపాడు.

IND vs PAK : పాక్ పై భార‌త్ విజ‌యం.. న్యూయార్క్ పోలీసుల‌కు ఢిల్లీ పోలీసుల ట్వీట్‌..

ఈ మ్యాచ్‌లో టీమ్ఇండియా బ్యాటింగ్ ముగిసిన త‌రువాత భార‌త జ‌ట్టు సాధించిన ప‌రుగుల‌ను చూసి త‌న జ‌ట్టు విజ‌యం సాధిస్తుంద‌ని భావించిన‌ట్లు చెప్పాడు. ఆట మొత్తం పాక్ చేతుల్లో ఉంది. అయితే.. బాబ‌ర్ ఔటైన త‌రువాత పాక్ అభిమానులు నిరుత్సాహప‌డ్డార‌న్నాడు. చివ‌రి వ‌ర‌కు పోరాడి భార‌త్ గెలిచింద‌ని తెలిపాడు. భార‌తీయుల‌కు శుభాకాంక్ష‌లు తెలియ‌జేశాడు. ప్ర‌స్తుతం ఈ వీడియో వైర‌ల్‌గా మారింది.

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. మొద‌ట బ్యాటింగ్ చేసిన భార‌త్ 19 ఓవ‌ర్ల‌లో 119 ప‌రుగుల‌కు ఆలౌటైంది. ల‌క్ష్య ఛేద‌న‌లో పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో ఏడు వికెట్లు కోల్పోయి 113 ప‌రుగుల‌కే ప‌రిమిత‌మైంది.

Pakistan : భార‌త్ చేతిలో ఓట‌మి.. టీ20 ప్ర‌పంచ‌క‌ప్ నుంచి పాకిస్తాన్ ఔట్‌..?