Pakistan : అభిమానుల నుంచి డ‌బ్బులు వ‌సూలు చేసిన పాకిస్తాన్ జ‌ట్టు.. ఒక్కొక్క‌రికి 25 డాల‌ర్లు..!

పాకిస్తాన్ జ‌ట్టు ఆట‌తోనే కాదు వారు చేసే ప‌నుల‌తోనూ వివాదాల్లో నిలుస్తూ ఉంటారు.

Pakistan Players Host Private Dinner For USD 25 Before T20 World Cup

Pakistan- Private Dinner : పాకిస్తాన్ జ‌ట్టు ఆట‌తోనే కాదు వారు చేసే ప‌నుల‌తోనూ వివాదాల్లో నిలుస్తూ ఉంటారు. పొట్టి ప్ర‌పంచ‌క‌ప్ 2024 కోసం అమెరికా వెళ్లిన బాబ‌ర్ ఆజాం సేన అక్క‌డ ప్రైవేటు డిన్న‌ర్‌ను ఏర్పాటు చేసిన‌ట్లుగా వార్త‌లు వ‌స్తున్నాయి. ‘మీట్ అండ్ గ్రీట్’ పేరుతో ఈ డిన్న‌ర్‌ను ఏర్పాటు చేశారు. ఇందులో పాల్గొనేందుకు 25 అమెరిక‌న్ డాల‌ర్ల‌ను ఎంట్రీ రుసుముగా విధించారు. దీని పై ఆ జ‌ట్టు మాజీ ఆట‌గాడు ర‌షీద్ ల‌తీఫ్ మండిప‌డ్డాడు.

సోషల్ మీడియాలో లతీఫ్ షేర్ చేసిన వీడియో ప్రకారం.. 25 అమెరికా డాలర్ల రుసుము చెల్లించిన అభిమానులు డిన్న‌ర్ స‌మ‌యంలో పాకిస్తాన్ ఆట‌గాళ్ల‌ను క‌ల‌వ‌డానికి అనుమ‌తి ఇచ్చారు. ఈ చ‌ర్య పాకిస్తాన్ క్రికెట్‌లో తీవ్ర దుమారం రేపింది. ఓ టీవీలో పాల్గొన్న ల‌తీఫ్ దీనిపై తీవ్ర అస‌హ‌నం వ్య‌క్తం చేశాడు. ఈ పార్టీలు గందరగోళానికి దారితీస్తాయని సూచించాడు.

Pakistan : అయ్యో పాకిస్తాన్‌.. ప్ర‌పంచ‌క‌ప్‌లో మొద‌టి మ్యాచ్‌కు ముందే బిగ్ షాక్‌..

‘అధికారిక విందులు ఉన్నాయి.. కానీ ఇది ప్రైవేట్ డిన్నర్. దీన్ని ఎవరు చేయగలరు? ఇది భయంకరమైనది. అంటే మీరు మా ఆటగాళ్లను 25 డాలర్లలో కలిశారు. అక్కడ గందరగోళం జరిగి ఉంటే.. అబ్బాయిలు డబ్బు సంపాదిస్తున్నారని ప్రజలు చెప్పేవారు.’ అని లతీఫ్ అన్నారు.

ఛారిటీ డిన్నర్‌లను నిర్వహించాలనే ఆలోచనను తాను అర్థం చేసుకోగ‌ల‌న‌ని, అయితే రుసుముతో ఒక ప్రైవేట్ డిన్నర్ అనేది త‌న ఊహాకు మించింది అని చెప్పాడు. పాకిస్తాన్ ఆట‌గాళ్ల‌కు ఎవ‌రు ఫోన్ చేసినా కూడా మీరు ఎంత డ‌బ్బు ఇస్తారు అని అడుగుతార‌ని ప్ర‌జ‌లు త‌న‌తో అన్న‌ట్లు ల‌తీఫ్ తెలిపాడు. ఇక తాను క్రికెట్ ఆడే స‌మ‌యంలోనూ ఇలాంటివి చేసేవార‌మ‌ని అన్నాడు. అయితే.. అవి అధికారిక విందులు అని చెప్పాడు.

Rohit Sharma : ఐర్లాండ్‌తో మ్యాచ్‌కు ముందు రోహిత్ శ‌ర్మ కీల‌క వ్యాఖ్య‌లు.. 150 ప‌రుగులు చేసినా చాలు..!

ఇది ప్ర‌పంచ‌క‌ప్ కాబ‌ట్టి, ఆట‌గాళ్లు ఎంతో జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని సూచించాడు. స్వ‌చ్చంద సంస్థ‌ల కోసం నిధుల సేక‌రించ‌డానికి రెండు లేదా మూడు విందులు చేసేందుకు వెళ్లినట్ల‌యితే ఓ అర్థం ఉంటుంది. కానీ ఇది ఓ ప్రైవేటు ఫంక్ష‌న్‌. పాకిస్తాన్ క్రికెట్ పేరుతో ఇలాంటి త‌ప్పు చేయ‌వ‌ద్ద‌ని చెప్పాడు.

ట్రెండింగ్ వార్తలు