ICC World Cup 2023: ఇండియాకు త్వరలో పాకిస్థాన్ భద్రతా ప్రతినిధి బృందం.. పాక్ జట్టు మ్యాచ్‌లు ఆడే మైదానాల సందర్శన

అక్టోబర్ 15న భారత్ - పాకిస్థాన్ మ్యాచ్ కు వేదికైన చెన్నై స్టేడియంతో పాటు, పాకిస్థాన్ మ్యాచ్‌లు ఆడే బెంగళూరు, హైదరాబాద్‌, కోల్‌కతా, అహ్మదాబాద్‌లను పాకిస్థాన్ భద్రతా బృందం త్వరలో సందర్శించనుంది.

ICC World Cup 2023

ICC World Cup 2023: ఈ ఏడాది అక్టోబర్ 5 నుంచి భారత్ వేదికగా ఐసీసీ ఫురుషుల వన్డే ప్రపంచ కప్ ప్రారంభమవుతుంది. నవంబర్ 19వరకు ఈ మెగా టోర్నీ జరుగుతుంది. ఈ మెగా‌టోర్నీ మ్యాచ్‌లు దేశంలోని పది స్టేడియాల్లో జరుగుతాయి. ఇప్పటికే ఏఏ స్టేడియాల్లో ఏరోజు ఏఏ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుందో షెడ్యూల్‌నుసైతం ఐసీసీ విడుదల చేసింది. ఈ ప్రపంచ కప్‌లో పొరుగు దేశం పాకిస్థాన్ జట్టుకూడా ఆడుతుంది. అయితే, భారత్‌లో పలు స్టేడియాల్లో తమ జట్టు ఆడదని, ఆ స్టేడియాల్లో పాక్ మ్యాచ్‌లు నిర్వహించవద్దని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఐసీసీని కోరింది. కానీ ఐసీసీ పాక్ క్రికెట్ బోర్డు విజ్ఞప్తిని ఏమాత్రం పట్టించుకోలేదు.

ICC World Cup 2023: సందిగ్ధంలో భారత్, పాక్ వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్.. క్లారిటీ ఇవ్వని పీసీబీ

ఈ నేపథ్యంలో భారత్‌లో పాక్ జట్టు ప్రయాణానికి క్లియరెన్స్ ఇచ్చే ముందు వేదికలను పరిశీలించడానికి పాకిస్థాన్ భద్రతా ప్రతినిధి బృందాన్ని ఇండియాకు పంపించనుంది. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు కొత్త ఛైర్మన్‌ని ఎన్నుకున్న తర్వాత భద్రతా ప్రతినిధి బృందాన్ని భారత్ కు ఎప్పుడు పంపాలో విదేశాంగ, అంతర్గత మంత్రిత్వ శాఖతో సహా ప్రభుత్వం నిర్ణయిస్తుందని ఇంటర్ – ప్రావిన్షియల్ కో- ఆర్డినేషన్ (స్పోర్ట్స్) మంత్రిత్వ శాఖలోని అధికారి ఒకరు తెలిపారు. పాకిస్థాన్ ఆడే వేదికలను, ప్రపంచ కప్ లో వారి కోసం ఏర్పాటు చేసిన భద్రత, ఇతర ఏర్పాట్లను పరిశీలించడానికి భద్రతా ప్రతినిధి బృందం పీసీబీ నుండి ప్రాతినిధ్యం వహిస్తుందని సదరు అధికారి తెలిపారు.

ICC World Cup 2023 Schedule: వరల్డ్ కప్ షెడ్యూల్ వచ్చేసింది.. అక్టోబర్ 8న తొలి మ్యాచ్ ఆడనున్న టీమిండియా.. ఉప్పల్ స్టేడియంలో మూడు మ్యాచ్‌లు..

అక్టోబర్ 15న భారత్ – పాకిస్థాన్ మధ్య జరిగే మ్యాచ్ వేదిక చెన్నైతో పాటు పాకిస్థాన్ మ్యాచ్ ఆడే బెంగళూరు, హైదరాబాద్, కోల్‌కతా, అహ్మదాబాద్‌లను పాక్ నుంచి వచ్చే ప్రతినిధుల బృందం సందర్శిస్తుంది.

పాకిస్థాన్ జట్టు ఆడే మ్యాచ్‌ల వివరాలు.. 

అక్టోబర్ 6: పాకిస్థాన్ వర్సెస్ క్వాలిఫయర్1 (హైదరాబాద్)
అక్టోబర్ 12: పాకిస్థాన్ వర్సెస్ క్వాలిఫయర్2 (హైదరాబాద్)
అక్టోబర్ 15: పాకిస్థాన్ వర్సెస్ భారత్ (అహ్మదాబాద్)
అక్టోబర్ 20: పాకిస్థాన్ వర్సెస్ ఆస్ట్రేలియా (బెంగళూరు)
అక్టోబర్ 23: పాకిస్థాన్ వర్సెస్ ఆఫ్ఘ‌నిస్తాన్‌ (చెన్నై)
అక్టోబర్ 27: పాకిస్థాన్ వర్సెస్ దక్షిణాఫ్రికా (చెన్నై)
అక్టోబర్ 31: పాకిస్థాన్ వర్సెస్ బంగ్లాదేశ్ (కోల్‌కతా)
నవంబర్ 4: పాకిస్థాన్ వర్సెస్ న్యూజిలాండ్ (బెంగళూరు)
నవంబర్ 12: పాకిస్థాన్ వర్సెస్ ఇంగ్లాండ్ (కోల్‌కతా)