ODI World Cup 2023: ప్రపంచకప్ మ్యాచ్‌కు ముందు.. ఈడెన్ గార్డెన్‌లో కుప్పకూలిన గోడ..!
భారత్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లోని మ్యాచులు రస వత్తరంగా సాగుతుండగా కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్‌లో ఓ ప్రమాదం చోటు చేసుకుంది.
- Thota Vamshi Kumar
- Published On : October 27, 2023 / 07:54 PM IST
Eden Gardens wall collapsesEden Gardens wall collapses
World Cup 2023 : భారత్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లోని మ్యాచులు రస వత్తరంగా సాగుతున్నాయి. ఖచ్చితంగా సెమీస్ రేసులో ఉంటాయని అనుకున్న కొన్ని జట్లు చలకిల పడుతున్నాయి. ఇక టీమ్ఇండియా మాత్రం వరుస విజయాలతో దూసుకుపోతుంది. ఆడిన ఐదు మ్యాచుల్లో విజయం సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. అయితే.. ఓ వైపు ప్రపంచకప్ మ్యాచులు సాగుతుండగా కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్‌లో ఓ ప్రమాదం చోటు చేసుకుంది. ఈడెన్ గార్డెన్‌లోని గోడలో కొంత భాగం కుప్పకూలింది.
గురువారం ఈ ఘటన జరిగింది. స్టేడియం బయట అభివృద్ధి పనులు జరుగుతుండగా ఓ జేసీబీ ఢీ కొట్టడంతో ఔట్ సైట్ వాల్ ధ్వంసమైంది. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. స్టేడియంలోని గేట్ నంబర్ 3, 4కు మధ్యన ఉన్న గోడ అది. ఈ గోడకు ఆనుకుని ఫ్లడ్‌లైట్ స్టాండ్ కూడా ఉంది. అయితే.. ఈ ఘటనలో ఫ్లడ్‌లైట్ స్టాండ్ కు ఎలాంటి నష్టం జరగలేదని బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ తెలిపింది. శనివారం బంగ్లాదేశ్, నెదర్లాండ్స్ జట్ల మధ్య మ్యాచ్ ఈ స్టేడియంలోనే జరగనుంది. ఈ నేపథ్యంలో యుద్ధ ప్రాతిపదికన గోడను పునఃనిర్మించే కార్యక్రమాలను చేపట్టారు.
Sheetal Devi : చేతులు లేకపోయినా.. 16 ఏళ్లకే ఆర్చరీలో చరిత్ర.. మెచ్చుకున్న ప్రధాని మోదీ
ప్రపంచకప్‌ను ఎంతో ఘనంగా నిర్వహిస్తున్న బీసీసీఐకి స్థానికంగా ఉన్న సమస్యలు కొత్త తలనొప్పిని తీసుకువస్తున్నాయని కొందరు నెటీజన్లు అంటున్నారు. కాగా.. ఈడెన్ గార్డెన్‌లో దక్షిణాఫ్రికాతో భారత జట్టు తలపడనుంది. నవంబర్ 5న ఈ మ్యాచ్ జరగనుంది. అంతే కాదు ఇంగ్లండ్, పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్‌తో పాటు నవంబర్ 16న జరగనున్న సెమీ ఫైనల్ మ్యాచ్‌కు ఈడెన్ గార్డెన్స్ ఆతిథ్యం ఇవ్వనుంది.
ఈడెన్ గార్డెన్స్ లో జరగాల్సిన మ్యాచులు ఇవే..
నెదర్లాండ్స్ వర్సెస్ బంగ్లాదేశ్ – అక్టోబర్ 28
పాకిస్థాన్ వర్సెస్ బంగ్లాదేశ్ – అక్టోబర్ 31
భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా – నవంబర్ 5
ఇంగ్లాండ్ వర్సెస్ పాకిస్థాన్ – నవంబర్ 11
సెమీ ఫైనల్ మ్యాచ్ – నవంబర్ 16
Riyan Parag : ప్రపంచ రికార్డును నెలకొల్పిన రియాన్ పరాగ్.. టీ20 క్రికెట్‌లో ఒకే ఒక్కడు..
