Riyan Parag : ప్రపంచ రికార్డును నెల‌కొల్పిన రియాన్ పరాగ్.. టీ20 క్రికెట్‌లో ఒకే ఒక్కడు..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) ను ఫాలో అయ్యే వారికి రియాన్ ప‌రాగ్ గురించి చెప్పాల్సిన ప‌ని లేదు.

Riyan Parag : ప్రపంచ రికార్డును నెల‌కొల్పిన రియాన్ పరాగ్.. టీ20 క్రికెట్‌లో ఒకే ఒక్కడు..

Riyan Parag scores six fifties

Riyan Parag scores six fifties : ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) ను ఫాలో అయ్యే వారికి రియాన్ ప‌రాగ్ గురించి చెప్పాల్సిన ప‌ని లేదు. రాజ‌స్థాన్ రాయ‌ల్స్ త‌రుపున అత‌డు కొన్ని సీజ‌న్లుగా ఆడుతున్నాడు. అయితే.. అత‌డు త‌న ఆట‌తో క‌న్నా మైదానంలో చేసే ఓవ‌ర్ యాక్ష‌న్‌తోనే ఎక్కువ‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. గ‌త సీజ‌న్‌లో అయితే అత‌డిని సోష‌ల్ మీడియాలో విప‌రీతంగా ట్రోలింగ్ చేశారు. దీంతో రియాన్ త‌న ప‌ద్ద‌తిని కాస్త మార్చుకున్న‌ట్లుగా క‌నిపిస్తోంది. ఇప్పుడు అత‌డు కేవ‌లం ఆట‌పై మాత్ర‌మే దృష్టి సారించాడు.

ఈ క్ర‌మంలో టీ20 క్రికెట్‌లో వ‌రుస‌గా ఆరు మ్యాచుల్లో హాఫ్ సెంచ‌రీలు సాధించి చ‌రిత్ర సృష్టించాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2023లో భాగంగా కేరళతో జరిగిన మ్యాచ్‌లో అస్సాం తరఫున రియాన్ పరాగ్ 33 బంతుల్లో 57 ప‌రుగుల‌ అజేయ ఇన్నింగ్స్‌తో ఈ ఘ‌న‌త‌ను అందుకున్నాడు.

స‌య్య‌ద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో రియాన్ రెచ్చిపోతున్నాడు. ఇప్ప‌టి వ‌ర‌కు ఏడు మ్యాచులు ఆడి 62.86 స‌గ‌టుతో 440 ప‌రుగులు చేశాడు. బౌలింగ్‌లో తొమ్మిది వికెట్లు తీసి జ‌ట్టు విజ‌యాల్లో కీల‌క పాత్ర పోషిస్తున్నాడు. ఈ క్ర‌మంలో టీ20 క్రికెట్ చరిత్రలో వరుసగా ఆరు అర్ధసెంచరీలు సాధించిన మొదటి ఆటగాడిగా నిలిచాడు.

MS Dhoni : రిటైర్‌మెంట్ పై ధోనీ హింట్‌.. ఐపీఎల్ 2024లో ఆడ‌డంపై ఏమ‌న్నాడంటే..?

భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ టీ20 క్రికెట్‌లో వరుసగా ఐదు అర్ధశతకాలు నమోదు చేసిన టీమ్ఇండియా మొదటి ఆటగాడు. అతను ఐపీఎల్‌ 2012 సీజన్‌లో ఈ ఘనతను సాధించాడు. డెవాన్ కాన్వే, హామిల్టన్ మసకద్జా, కమ్రాన్ అక్మల్, జోస్ బట్లర్, డేవిడ్ వార్నర్, వేన్ మాడ్సెన్ లు కూడా టీ20 క్రికెట్‌లో వ‌రుస‌గా ఐదు మ్యాచుల్లో ఐదు అర్థ‌శ‌త‌కాలు చేయ‌గా. ఇప్పుడు ఈ రికార్డును రియాన్ ప‌రాగ్ బ్రేక్ చేశాడు. రియాన్‌.. 61, 76 నాటౌట్‌, 53 నాటౌట్‌, 76, 72, 57 నాటౌట్ స్కోర్లు సాధించి చ‌రిత్ర సృష్టించాడు.